Share News

చికెన్‌ వండనందుకే హత్య

ABN , Publish Date - May 21 , 2026 | 12:08 AM

ఒకే రూంలో ఉన్న స్నేహితుల్లో ఒకడు చికెన్‌ వండమని చెప్పినా టమోటా పచ్చడి చేయడంతో రోకలి బండతో కొట్టి హత్య చేశాడు. ఈ ఘటన ఈనెల 14వ తేదీన అహోబిలంలో జరిగింది

చికెన్‌ వండనందుకే హత్య
అరెస్టు చూపిస్తున్న డీఎస్పీ శ్రీనివాసరావు

ఆళ్లగడ్డ, మే 20 (ఆంధ్రజ్యోతి): ఒకే రూంలో ఉన్న స్నేహితుల్లో ఒకడు చికెన్‌ వండమని చెప్పినా టమోటా పచ్చడి చేయడంతో రోకలి బండతో కొట్టి హత్య చేశాడు. ఈ ఘటన ఈనెల 14వ తేదీన అహోబిలంలో జరిగింది. నిందితుడిని బుధవారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. వివరాలు.. అహోబిలం గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో బండిత్మకూరు మండలం నారాయణ పురం గ్రామానికి చెందిన ఎరుకలి శంకర్‌, వడ్డెశివ రేకుల షెడ్డులో కలిసి ఉండేవారు. ఇరువురు మద్యానికి బానిసయ్యారు. ఈనెల 14వ తేదీ రాత్రి ఇరువురు మద్యం సేవించారు. శివ చికెన్‌ వండమని శంకర్‌కు చెప్పాడు. అతడు చికెన్‌ చేయకుండా టమాటా పచ్చడి చేశాడు. దీన్ని మనసులో పెట్టుకొన్న శివ రాత్రి 9గంటల ప్రాంతంలో రోకలి బండతో పడుకున్న శంకర్‌ నుదుటి మీద, తలపై బలంగా కొట్టడంతో మృతి చెందాడు. ఈమేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు శివ ఆళ్లగడ్డ నుంచి అహోబిలం వెళ్లే రహదారిలో పడకండ్ల గ్రామం దుర్గామాత ఆలయం వద్ద ఉండగా అరెస్టు చేశారు. రూరల్‌ సీఐ బీవీ రమణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2026 | 12:08 AM