Share News

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రాజీనామా

ABN , Publish Date - Mar 04 , 2026 | 10:53 PM

ఆత్మకూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న డాక్టర్‌ మారూఫ్‌ ఆసియా బుధవారం తన పదవికి రాజీనామా చేశారు.

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రాజీనామా
మున్సిపల్‌ కమిషనర్‌కు రాజీనామా పత్రాన్ని అందజేస్తున్న చైర్‌పర్సన్‌ డాక్టర్‌ మారూఫ్‌ ఆసియా

ఆత్మకూరు, మార్చి 4(ఆంధ్రజ్యోతి): ఆత్మకూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న డాక్టర్‌ మారూఫ్‌ ఆసియా బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. తన పదవి కాలానికి ఇం కా రెండు వారాలు గడువు ఉండగానే ఆత్మకూరు అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో ఆమెకు డాక్టర్‌గా అవకాశం వచ్చింది. బుధవారం ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ ఓబులేసుకు తన రాజీనామా పత్రాన్ని అందజేసి ఆమోదించాలని కోరారు. మీడియాతో మాట్లాడుతూ.. తాను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బాధ్యతలు చేపట్టాక ఆత్మకూరులో రూ.21.84కోట్లతో పలు అభివృద్ధి పనులను చేపట్టినట్లు వివరించారు. ఇందుకు సహకరించిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డికి, మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డికి, మున్సిపల్‌ కౌన్సిలర్లకు, కోఆప్షన్‌సభ్యులకు, అధికారులకు, ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. సొంతూరులోనే ప్రజలకు వైద్యసేవలందించేలా తనకు డాక్టర్‌గా అవకాశం రావడంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Updated Date - Mar 04 , 2026 | 10:53 PM