కొలువుదీరిన మండలాధ్యక్షులు
ABN , Publish Date - Nov 20 , 2026 | 12:04 AM
మండల అధ్యక్షురాలిగా మద్దూరు ఎంపీటీసీ సభ్యురాలు లక్ష్మిప్రసన్న, ఉపాఉపాధ్యక్షురాలిగా ఆకుల మెహ్రన్‌బీ(చాగలమర్రి-6) ప్రమాణ స్వీకారం చేశారు
చాగలమర్రి ఎంపీపీగా లక్ష్మిప్రసన్న
చాగలమర్రి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): మండల అధ్యక్షురాలిగా మద్దూరు ఎంపీటీసీ సభ్యురాలు లక్ష్మిప్రసన్న, ఉపాఉపాధ్యక్షురాలిగా ఆకుల మెహ్రన్‌బీ(చాగలమర్రి-6) ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే అఖిలప్రియ హాజరయ్యారు. పేదల సంక్షేమమే లక్ష్యమని సర్పంచ్ ఎన్నికల్లో కూడా విజయదుందుభి మోగిస్తామన్నారు. గురువారం ఆర్వో సునీల్‌ఖన్నా ప్రమాణస్వీకారం చేయించారు. టీడీపీ ఎంపీటీసీలు కొలిమి మహబూబ్‌బాషా, జట్టి కుమార్, గడ్డం సుస్మిత, జహరాబీ, బీజాన్, దావీద్, జనసేన ఎంపీటీసీ దేవదాసు, వైసీపీ ఎంపీటీసీలు ముల్లా సాహిరాబేగం, జ్యోతిశ్వర్‌రెడ్డి, హనుమానాయక్, పర్మిళ, జహదాబీ, ప్రభావతమ్మచే ప్రతిజ్ఞ చేయించారు. జడ్పీటీసీ నరసింహారెడ్డి, అన్సర్‌బాషా, మౌలాలి, కొలిమి హుస్సేన్‌వలి, మాబూషరీఫ్, హనీఫ్, అనిల్‌కుమార్‌రెడ్డి, బ్రహ్మనందరెడ్డి, గురుశేఖర్‌రెడ్డి, రమణారెడ్డి, హుస్సేన్‌రెడ్డి, అస్రఫ్, హుస్సేన్‌బాష, ఆవుల ప్రతాప్, పాల్గొన్నారు.
ఆళ్లగడ్డలో కూటమి బలం
ఆళ్లగడ్డ, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కూటమి బలం చూసి రెండు రాష్ట్రాల నాయకులు ఆశ్యర్య పోతున్నారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీగా శీలం గీతావాణి, వైఎస్ ఎంపీపీ అశోక్, ఎంపీటీసీ సభ్యులలచే ఆర్‌వో హరిగోపాల్, ఏఆర్‌వో నూర్జహాన్ లు ప్రమాణ స్వీకారం చేయించారు. నియోజకవర్గంలో 71 ఎంపీటీసీ స్ధానాలకుగాను 46 ఎంపీటీసీలను టీడీపీ కౌవసం చేసుకుందన్నారు. అలాగే ఆరు జడ్పీటీసీలు, ఆరు ఎంపీపీలు, వైఎస్ ఎంపీపీ స్థానాలకు కైవసం చేసుకున్నామన్నారు. ఏకగ్రీవం విజయమని దీన్ని వారికే అంకితం చేస్తున్నట్లు చె ప్పారు. ఆళ్లగడ్డ అంటే బాంబుల అడ్డా కాదని అభివృద్దికి అడ్డాగా మార్చామన్నా రు. జడ్పీ చైర్మన్‌ను అధిష్టానం నిర్ణనయన్నారు. కన్వీనర్ శీలం హరికుమార్‌రెడ్డి, కౌల్సిలర్ హుసెన్‌షా పాల్గొన్నారు.
మండల అభివృద్ధికి కృషి
డోన్ టౌన్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): మండల అభివృద్దికి కృషి చేస్తామని ఎంపీపీ యు.రామాంజనేయులు, వైస్ ఎంపీపీగా వెంకటనాయునిపల్లె ఎంపీటీసీ లక్ష్మీపార్వతమ్మ అన్నారు. గురువారం పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే కోట్ల సమక్షంలో ఆర్వో ఎన్.రామాంజనేయులు, డీఎల్‌డీవో భాస్కర్ రెడ్డి, ఎంపీడీవో కే.చంద్రశేఖర్ ఆధ్వర్యంలో 18 ఎంపీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఎంపీపీగా ఉడుములపాడు ఎంపీటీసీ యు.రామాంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆర్వో ప్రకటించారు. అలాగే వైస్‌ఎంపీపీగా వెంకటనాయునిపల్లె ఎంపీటీసీ బి.లక్ష్మిపార్వతమ్మ ఎన్నికయ్యారు. అనంతరం ప్రమాణస్వీకారం చేశారు. ఎమ్మెల్యే కోట్ల సహకారంతో డోన్ మండల అభివృద్దికి కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యే కోట్ల, అధికారులు నూతన ఎంపీపీ, వైస్‌ఎంపీపీలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఓబులాపురం శేషిరెడ్డి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు సలీంధ్ర శ్రీనివాసులు యాదవ్, దశరథరామిరెడ్డి, రేగటి అర్జున్ రెడ్డి, గుమ్మకొండ శంకర్, గోసానిపల్లె శ్రీరాములు, ఎంపీటీసీలు సీలబోయిన వెంకటేశ్, రసూల్‌బీ, వాల్మీకి వెంకటలక్ష్మి, పీఆర్ ఏఈ నారాయణ నాయకులు పాల్గొన్నారు.
బనగానపల్లె ఎంపీపీగా మీనాకుమారి
బనగానపల్లె, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): ఎంపీపీగా పలుకూరు ఎంపీటీసీ గుండం మీనాకుమారిని ఎన్నుకున్నారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో ఆర్‌వో సుధాకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. మండలంలో 28ఎంపీటీసీ స్థానాలు ఉండగా, 18టీడీపీ, 10వైసీపీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మీనాకుమారి మాట్లాడుతూ మండల అభివృద్దికి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ అంబాల రామకృష్ణారెడ్డి సహకారంతో తనవంతు కృషి చేస్తానని, మంత్రి బీసీకి కృతజ్ఞతలు తెలిపారు. మాజీ ఎంపీపీ అంబాల రామకృష్ణారెడ్డి, అంబాల ప్రభాకర్‌రెడ్డి, చల్లామద్దిలేటి, గుండం మల్లిఖార్జునరెడ్డి, వల్లెపుశంకర్, కె.ఏ.సలాం, అల్తా్‌పహుసేన్, ఎంపీడీవో నాగరాజు డిప్యూటీ ఎంపీడీవో సురేంద్రనాథ్‌యాదవ్, తిరుమలేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్యాపిలిని తీర్చిదిద్దుతాం
ప్యాపిలి, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): ప్యాపిలిని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతానని ఎంపీపీ రాజశేఖర్ నాయుడు అన్నారు. గురువారం పరిషత్ కార్యాలయంలో కలచట్ల ఎంపీటీసీ సభ్యులు రాజశేఖర్‌నాయుడు ఎపీపీగా, గుడిపాడు ఎంపీటీసీ సువర్ణ వైస్ ఎంపీపీగా ప్రమాణస్వీకారం చేశారు. అంతకు ముందుగా టీడీపీకి చెందిన 13 మంది, వైసీపీకి చెందిన 8 మంది ఎంపీటీసీ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఆర్వోలు సోమశివానందరెడ్డి, శ్రీనివాసరావు సభ్యుల చేత ప్రమాణస్వీకారం చేయించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఎమ్మెల్యే కోట్ల, కోట్ల రాఘవేంద్రరెడ్డి, డీసీఎంఎస్ చైర్మేన్ వై.నాగేశ్వరరావుయాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభాకర్‌రెడ్డి, వై లక్ష్మినారాయణయాదవ్, సీమ సుధాకర్‌రెడ్డి, టి. శ్రీనివాసులు పాల్గొన్నారు.
శిరివెళ్లకు మేరువ శాంతి
శిరివెళ్ల, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): మండలాధక్షురాలిగా యర్రగుంట్ల-2 ఎంపీటీసీ సభ్యురాలైన మేరువ శాంతి గురువారం ప్రమాణ స్వీకరాం చేశారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్‌వో విజయ శేఖర్ ఎంపీటీసీలచే ప్రమాణస్వీకారం చేయించారు. అలాగే శిరివెళ్ల-5 ఎంపీటీసీ సభ్యురాలు సూరా లక్ష్మీదేవి వైఎస్ ఎంపీపీగా ప్రమాణం స చేశారు. కన్వీనర్ కాటంరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శివరామిరెడ్డి, మాజీ జడ్పీటీసీ యామా గుర్రప్ప, సూరా రామ, మేరువ చిన్న నరసింహారెడ్డి, మహమ్మద్ హుసేన్, ఎంపీడీవో శివ మల్లేశ్వరప్ప, తహసీల్దార్ విజయశ్రీ పాల్గొన్నారు.
మండలాన్ని అభివృద్ధి చేస్తా
కొలిమిగుండ్ల : మంత్రి బీసీ సహకారంతో కొలిమిగుండ్ల మండలాన్ని అభివృద్ది చేస్తామని ఎంపీపీ విఆర్ లక్ష్మీరెడ్డి, వైస్ ఎంపీపీ మూలే రామేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆర్‌వో హరినాఽథ్ రెడ్డి, ఎంపీడీవో దస్తగిరి బాబు, ఏవో ప్రసాద్ రెడ్డి వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. జడ్పీటీసీ రమాదేవి, నంద్యాల రామేశ్వర్‌రెడ్డి ఉన్నారు. అంబటి జయలక్ష్మీ రెడ్డి, వెంకట మల్లారెడ్డి, కనకాద్రిపల్లె మాజీ సర్పంచ్ శివశంకర్, ఓబులేసు, నాగప్ప, చంద్రమోహన్ గౌడ్, ఎంపీటీసీ లక్ష్మీకాంత, రంగనాయక్ ఉన్నారు.