Share News

అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరు

ABN , Publish Date - Oct 12 , 2026 | 12:06 AM

అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యుడు రామాంజనేయులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు.

అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరు
జ్ఞానేశ్‌కుమార్‌ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న సీపీఐ నాయకులు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రామాంజనేయులు

కర్నూలు న్యూసిటీ, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యుడు రామాంజనేయులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. ఢిల్లీతో పాటు విజయవాడ కేంద్రంలో పోలీసు బలగాలు విద్యార్థి, యువజన వామపక్ష, ప్రతిపక్ష నాయకుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఆదివారం వామపక్షాల అధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి నగర కార్యదర్శి పి.రామక్రిష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. రామాంజనేయులు మాట్లాడుతూ దేశంలో 13.39 కోట్ల ఓట్లు గల్లంయతాయ్యాయన్నారు. ప్రధాని మోదీ ప్రజా ఉద్యమానికి స్పందించి ఎన్నికల అధి కారిని తొలగించాలని, లేనిపక్షంలో ప్రజా ఆగ్రహంలో బీజేపీ కొట్టుకుపోతుందని హెచ్చరిం చారు. ఎన్‌యూసీఐ జిల్లా నాయకుడు నాగన్న, సీపీఐ ఎంల్‌ న్యూ డెమోక్రసీ నాయకుడు భాస్కర్‌, రైతు సంఘం జిల్లాఅధ్యక్షుడు నాగేంద్రయ్య, ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి శ్రీని వాసులు, నాగరాజు, బీసన్న పాల్గొన్నారు.

Updated Date - Oct 12 , 2026 | 12:06 AM