Share News

అహింస కోసం వాసవీ మాత ఆత్మార్పణ

ABN , Publish Date - Jan 20 , 2026 | 11:27 PM

వాసవి కన్యకా పరమేశ్వరి అహింస కోసం ఆత్మార్పణ చేశారని కలెక్టర్‌ డా. సిరి అన్నారు. వాసవీమాత ఆత్మార్పణ దినం సందర్భంగా మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ సిరి. జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌, కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు వాసవి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అహింస కోసం వాసవీ మాత ఆత్మార్పణ
నివాళులర్పిస్తున్న కలెక్టర్‌ సిరి

కలెక్టర్‌ డా. సిరి

కర్నూలు కలెక్టరేట్‌, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): వాసవి కన్యకా పరమేశ్వరి అహింస కోసం ఆత్మార్పణ చేశారని కలెక్టర్‌ డా. సిరి అన్నారు. వాసవీమాత ఆత్మార్పణ దినం సందర్భంగా మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ సిరి. జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌, కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు వాసవి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ యుద్ధం, రక్తపాతం నివారించేందుకు ప్రజల గౌరవం, అహింస, ధర్మం, సత్యం కోసం వాసవి మాత ఆత్మార్పణం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో వెంకట నారాయణమ్మ, దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ సుధాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 20 , 2026 | 11:27 PM