Share News

పాలనపై మరింత విశ్వాసం

ABN , Publish Date - Aug 03 , 2026 | 12:17 AM

కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలలో మరింత విశ్వాసం పెరిగిందని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ పేర్కొన్నారు.

పాలనపై మరింత విశ్వాసం
ప్రభుత్వ పథకాలను వివరిస్తున్న మంత్రి ఫరూక్‌

న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌

నంద్యాల రూరల్‌, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి) : కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలలో మరింత విశ్వాసం పెరిగిందని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ పేర్కొన్నారు. మండలంలోని పులిమద్ది గ్రామంలో ఆదివారం నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకా లను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు శ్రమకు ప్రతిఫలంగా ఎంతో మంది పారిశ్రామి కవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి తరలివస్తున్నట్లు తెలిపారు. నంద్యాల నియోజకవర్గంలో భవిష్యత్‌లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతు న్నట్లు వెల్లడించారు.

రోడ్డు నిర్మాణానికి భూమిపూజ : పులిమద్ది గ్రామంలో రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ భూమిపూజ చేశారు. పులిమద్దిలో రూ4.38 కోట్లతో రహదారి నిర్మాణ పనులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. త్వరలో పనులు ప్రారంబించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నం ద్యాల మార్కెట్‌ యార్డు చైర్మెన్‌ గుంటుపల్లి హరిబాబు, నంద్యాల అర్బన్‌, రూరల్‌ తహసీల్దార్లు శ్రీనివాసులు, శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 03 , 2026 | 12:17 AM