మొల్ల నేటి తరానికి స్ఫూర్తి
ABN , Publish Date - Mar 13 , 2026 | 11:27 PM
కవయిత్రిగా స్వతంత్ర రచనలకు మార్గం వేసిన మొదటి మహిళ మొల్ల అని నంద్యాల జిల్లా స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి కొనియాడారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా జయంతి
నివాళులర్పించిన పోలీసులు
నంద్యాల క్రైం, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): కవయిత్రిగా స్వతంత్ర రచనలకు మార్గం వేసిన మొదటి మహిళ మొల్ల అని నంద్యాల జిల్లా స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి కొనియాడారు. శుక్రవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రముఖ కవయిత్రి ‘మొల్ల’ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళు లిర్పించారు. అనంతరం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎలాంటి రాజపోషణ లేకుండానే కేవలం భక్తితో ఆమె చేసిన సాహిత్య కృషి నేటి తరానికి, మహిళా సాధికారతకు గొప్ప స్ఫూర్తి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు మంజునాథ్, బాబు, ఆర్‌ఎస్‌ఐలు ఉమామహేశ్వరరెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, శ్రీనివాసులు, జిల్లా పోలీసు పరిపాలనా విభాగం అధికారులు క్రిష్ణారెడ్డి, ఖాదర్‌వలి పాల్గొన్నారు.