Share News

ముర్రు పాలతో శిశువుకు ఆరోగ్యం

ABN , Publish Date - Aug 09 , 2026 | 11:56 PM

పుట్టిన బిడ్డకు గంటలోపు ముర్రుపాలు పట్టడం వల్ల బిడ్డకు ఆరోగ్యమని డోన్‌ ఐసీడీఎస్‌ సీడీపీవో శంషాద్‌ బేగం అన్నారు. శనివారం రాత్రి పట్టణంలోని 18వ అంగన్‌వాడీ కేంద్రంలో సూపర్‌వైజర్‌ రాధమ్మ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు.

ముర్రు పాలతో శిశువుకు ఆరోగ్యం
మాట్లాడుతున్న డోన్‌ సీడీపీవో శంషాద్‌ బేగం

బేతంచెర్ల, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): పుట్టిన బిడ్డకు గంటలోపు ముర్రుపాలు పట్టడం వల్ల బిడ్డకు ఆరోగ్యమని డోన్‌ ఐసీడీఎస్‌ సీడీపీవో శంషాద్‌ బేగం అన్నారు. శనివారం రాత్రి పట్టణంలోని 18వ అంగన్‌వాడీ కేంద్రంలో సూపర్‌వైజర్‌ రాధమ్మ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. శివువుకు ఆరు నెలల పాటు తల్లిపాలు తాపిస్తే, ఆరోగ్యంగా ఎదగడానికి అన్ని పోషకాలు లభించడంతో పాటు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని సూచించారు. ఆరు నెలల తర్వాత కొద్దికొద్దిగా ఆహారం అలవాటు చేయాలని, అప్పుడు బిడ్డ ఎదిగిన తర్వాత అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. 18 సం. రాలలోపు బాల బాలికలకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమని, చిన్న వయస్సులోనే వివాహం చేస్తే ప్రసవ సమయంలో తల్లి బిడ్డ మరణించే ప్రమాదం అధికంగా ఉంటుందని, బాల్యవివాహాలు ప్రోత్సహించిన వారు శిక్షార్హులన్నారు. సూపర్‌వైజర్‌ అరుణ, అంగన్‌వాడీ జిల్లా అఽధ్యక్షురాలు శోభరాణి, లక్ష్మిదేవి, రామతులసి, రాజేశ్వరి, లబ్దిదారులు రామేశ్వరి, సుస్మిత, శ్రావణి, లక్ష్మీబాయ్‌, సుశీల, సుచరిత పాల్గొన్నారు.

Updated Date - Aug 09 , 2026 | 11:56 PM