అభివృద్ధి ప్రదాత మోక్షగుండం విశ్వేశ్వరయ్య
ABN , Publish Date - Sep 16 , 2026 | 12:31 AM
అభివృద్ధి ప్రదాత మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని ఏపీ ట్రాన్సకో ప్రాజెక్ట్స్ ఎస్‌ఈ వేణుమాధవ్ కొనియాడారు.
ట్రాన్సకో ఎస్‌ఈ వేణుమాధవ్
కల్లూరు, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి ప్రదాత మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని ఏపీ ట్రాన్సకో ప్రాజెక్ట్స్ ఎస్‌ఈ వేణుమాధవ్ కొనియాడారు. ఇంజనీర్స్ డేను పురస్కరించుకుని మంగళవారం నగరంలోని టీజీవీ భవనలో ఏపీఎ్‌సఈబీ ఇంజనీర్స్ అసోసియేషన ఆధ్వర్యంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఏపీ ట్రాన్సకో, ఏపీఎ్‌సపీడీసీఎల్ ఈఈ, డీఈఈ, విద్యుత సంఘ నాయకులు హాజరయ్యారు. ట్రాన్సకో ఎస్‌ఈ మాట్లాడుతూ ఇంజనీర్ల వ్యవస్థకు వన్నెతెచ్చి, సమాజానికి విశిష్ట సేవలందించిన మోక్షగుండం విశ్వేశ్వర్య సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో ఏపీఎ్‌సఈబీ ఇంజనీర్స్ అసోసియేషన ఆఫీస్ బేరర్స్ హెచ.గంగన్న, జి.జగదీశ్వరరెడ్డి, కె.నాగప్రసాద్, బి.కృష్ణ, విశ్వశాంతి స్వరూప్, రవికుమార్ రెడ్డి, బి.రంగస్వామి, సురేంద్రరెడ్డి, విజయభాస్కర్ పాల్గొన్నారు.
కర్నూలు ఎడ్యుకేషన: దేశానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు చిరస్మరణీయమని ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎస్. నాగస్వామి నాయక్ అన్నారు. మంగళవారం స్థానిక బీ.క్యాంపులోని ప్రభుత్వ వృత్తి విద్య జూనియర్ కళాశాలలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అధ్యాపకులు మల్లికార్జున, విజయశేఖర్, రామకృష్ణ, కృష్ణమోహన, సోమేష్, సారధి పటేల్, చిన్న మల్లేష్, ఉల్గోజిరావు, శ్రావణి, శ్రీధర్ మూర్తి, ఇంతియాజ్ పాల్గొన్నారు.