ఇంజనీర్లకు మోక్షగుండం స్ఫూర్తి ప్రదాత
ABN , Publish Date - Jan 01 , 2026 | 11:31 PM
ఇంజనీరింగ్ పి తామహుడు దిగవంగత మోక్షగుండం విశ్వేశ్వరయ్య యువ ఇంజ నీర్లు, యువతరానికి స్ఫూర్తిప్రదాత అని జల వనరుల శాఖ కర్నూలు ప్రాజెక్ట్స్ సీఈ కబీర్‌బాషా పేర్కొ న్నారు.
జల వనరుల శాఖ సీఈ కబీర్‌బాషా
సీఈ కార్యాలయ ఆవరణలో విశ్వేశ్వరయ్య విగ్రహావిష్కరణ
కర్నూలు, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్ పి తామహుడు దిగవంగత మోక్షగుండం విశ్వేశ్వరయ్య యువ ఇంజ నీర్లు, యువతరానికి స్ఫూర్తిప్రదాత అని జల వనరుల శాఖ కర్నూలు ప్రాజెక్ట్స్ సీఈ కబీర్‌బాషా పేర్కొ న్నారు. కర్నూలు నగరంలోని సీఈ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహాన్ని సీఈ, ఎస్‌ఈలు, ఇంజనీర్లు గురవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఈ కబీర్‌బాషా మాట్లాడుతూ మోక్షగుండం ఒక ఇంజనీరే కాదు.. పండితుడు, రాజనీతిజ్ఞుడని, మైసూర్ దివానుగా పని చేశాడని గుర్తు చేశారు. ఆయన సేవలు గుర్తించిన బ్రిటీష్ ప్రభుత్వం తరపున ఐదో కింగ్‌జార్జి నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ బిరుదుతో సత్కరించారని అన్నారు. స్వాతంత్య్రం తరువాత భారత ప్రభుత్వం 1955లో భారతరత్న ఇచ్చి సత్కరించదని తెలిపారు. కావేని నదిపై ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన కృష్ణరాజసాగర్ ఆనకట్టను, తుంగభద్ర ప్రాజెక్డును కూడా ఆయన పర్యవేక్షణలోనే నిర్మించారని అన్నారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ కర్నూలు సర్కిల్ ఎస్‌ఈ బాలచంద్రారెడ్డి, హంద్రీనీవా ప్రాజెక్టు కర్నూలు సర్కిల్ ఎస్‌ఈ పాండురంగయ్య, ఎస్‌ఆర్‌బీసీ సర్కిల్-1 ఎస్‌ఈ శుభకుమార్, తెలుగుగంగ ప్రాజెక్టు ఎస్‌ఈ ప్రతాప్, డిప్యూటీ సీఈ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.