Share News

మోదీ పాలన అస్తవ్యస్తం

ABN , Publish Date - Aug 09 , 2026 | 12:31 AM

కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ పాలన అస్తవ్యస్తంగా మారిందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రయ్య అన్నారు. సీపీఐ దేశవ్యాప్త ప్రచార పాదయాత్రలో భాగంగా మూడో రోజు శనివారం 17వ వార్డు ఏ.క్యాంపు, చాణిక్యపురి కాలనీ, బుధవారపేట, రాజీవ్‌గృకల్ప, సంజయ్‌గాంధీ నగర్‌ మీదుగా పాదయాత్ర నిర్వహించారు.

మోదీ పాలన అస్తవ్యస్తం
పాదయాత్రలో మాట్లాడుతున్న రామచంద్రయ్య

కర్నూలు న్యూసిటీ, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ పాలన అస్తవ్యస్తంగా మారిందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రయ్య అన్నారు. సీపీఐ దేశవ్యాప్త ప్రచార పాదయాత్రలో భాగంగా మూడో రోజు శనివారం 17వ వార్డు ఏ.క్యాంపు, చాణిక్యపురి కాలనీ, బుధవారపేట, రాజీవ్‌గృకల్ప, సంజయ్‌గాంధీ నగర్‌ మీదుగా పాదయాత్ర నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మోదీ 12 ఏళ్ల పాలనలో 4.50లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి సీపీఐ అధ్వర్యంలో ప్రచార జాతులు నిర్వహించి 18న కలెక్టరేట్ల ముట్టడి, సెప్టెంబర్‌ 1న చలో ఢిల్లీ నిర్వహిస్తున్నామన్నారు. దీనికి సామాన్య ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. నగర కార్యదర్శి పి.రామక్రిష్ణారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాసులు, నాగరాజు, జి.చంద్రశేఖర్‌, బీసన్న, భద్రకుమార్‌, అన్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 09 , 2026 | 12:32 AM