Share News

త్వరలో ఆధునిక ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఏర్పాటు

ABN , Publish Date - Jun 10 , 2026 | 11:51 PM

నగరంలో ఆధునిక ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు తెలిపారు.

త్వరలో ఆధునిక ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఏర్పాటు
అధికారులతో మాట్లాడుతున్న కమిషనర్‌ చల్లా ఓబులేసు

నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు

కర్నూలు న్యూసిటీ, జూన 10(ఆంధ్రజ్యోతి): నగరంలో ఆధునిక ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు తెలిపారు. బుధవారం వెంకటరమణ కాలనీలోని నగర పాలక కార్యాలయంలో ఆయన ఇంజనీరింగ్‌, పట్టణ ప్రణాళిక విభా గాల అధికారులతోపాటు ట్రాఫిక్‌ పోలీసులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పీపీపీ ప్రాజెక్టు కింద ప్రస్తుతం ఉన్న 16 సిగ్నల్స్‌ అద నంగా మరో 10 సిగ్నల్స్‌ ఏర్పాటు కమిషనర్‌ వెల్లడించారు. మొత్తం 26 ఆధునిక ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ నగరంలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడిం చారు. ఈసమావేశంలో అడిషనల్‌ కమిషనర్‌ ఆర్‌జీవీ కృష్ణ, డిప్యూటీ కమిషనర్‌ సతీష్‌కుమార్‌రెడ్డి, ట్రాఫిక్‌ సీఐ మన్సూరుద్దీన, ఎస్‌ఈ రమ ణమూర్తి, ఇనచార్జి సిటీ ప్లానర్‌ వెంకటరమణ, ఎంఈ మనోహర్‌రెడ్డి, డీఈఈలు శ్రీనివాసన, పవనకుమార్‌ రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2026 | 11:51 PM