Share News

ఆదర్శ స్నేహితులు

ABN , Publish Date - Aug 03 , 2026 | 12:43 AM

మండల క్రేందంలో స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆదివారం 2002-07 రుద్రవరం కన్యకాపరమేశ్వరి ఉన్నత పాఠశాల విద్యార్థులు రక్తదానం చేశారు. ఎస్‌ఐ జయప్ప మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో రక్తం మనిషి ప్రాణాన్ని కాపాడుతుందన్నారు

ఆదర్శ స్నేహితులు
రక్తదాన శిబిరం ప్రారంభిస్తున్న ఎస్‌ఐ జయప్ప

రక్తదానం చేసిన 63 మంది..

రుద్రవరం, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): మండల క్రేందంలో స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆదివారం 2002-07 రుద్రవరం కన్యకాపరమేశ్వరి ఉన్నత పాఠశాల విద్యార్థులు రక్తదానం చేశారు. ఎస్‌ఐ జయప్ప మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో రక్తం మనిషి ప్రాణాన్ని కాపాడుతుందన్నారు.

రక్తదానంతో మరొకరికి ప్రాణం

రక్తదానం చేస్తే మరొకరి ప్రాణాన్ని కాపాడినవారమవుతాం. స్నేహితులమందరం కలిసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. - సురేంద్ర, రుద్రవరం

రక్తదానం చేసినందకు ఆనందం..

స్నేహితుల దినోత్సవం రోజున రక్తదానం చేయడం ఆనందం ఇచ్చింది. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే స్నేహం. అదే చిరకాలం కొనసాగిస్తాం. - మహబూబ్‌బాషా, మాచినేనిపల్లె

సేవా కార్యక్రమంతో స్నేహితుల దినోత్సవం

బేతంచెర్ల:స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శేషారెడ్డి ఉన్నత పాఠశాల 1980-81 పూర్వ విద్యార్ధులు వృద్ధాశ్రమానికి సరుకులు ఇచ్చారు. ఆదివారం పట్టణంలోని రోటరీ క్లబ్‌ కమ్యూనిటీ హాల్‌లో సమ్మేళనం ఏర్పాటు చేశారు. వీరభద్రా రెడ్డి, అహ్మద్‌ హుస్సేన్‌, గౌరీ రామిరెడ్డి, జ్ఞానేశ్వర్‌ గుప్తా, జగన్‌ మాట్లాడుతూ స్నేహం జీవితాంతం కొనసాగే బంధమన్నారు. ప్రసాద్‌ రెడ్డి, రామకృష్ణ, బాలకృష్ణ, రాజశేఖర్‌, బషీర్‌ అహ్మద్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 03 , 2026 | 12:43 AM