Share News

594 మొబైల్స్‌ రికవరీ

ABN , Publish Date - Jul 25 , 2026 | 11:39 PM

జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నిర్వహించిన 6వ విడత మొబైల్‌ రికవరీ మేళాలో 594 మొబైల్‌ ఫోన్లను బాధితులకు అందజేశారు. వీటి మొత్తం విలువ రూ 1,06,92,590గా అధికారులు తెలిపారు

594 మొబైల్స్‌ రికవరీ
సెల్‌ఫోన్లను బాధితులకు అందిస్తున్న ఏఎస్పీ సుష్మిత

బాధితులకు అందజేసిన నంద్యాల పోలీసులు

నంద్యాల క్రైమ్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి): జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నిర్వహించిన 6వ విడత మొబైల్‌ రికవరీ మేళాలో 594 మొబైల్‌ ఫోన్లను బాధితులకు అందజేశారు. వీటి మొత్తం విలువ రూ 1,06,92,590గా అధికారులు తెలిపారు. డీఐజీ కోయ ప్రవీ ణ్‌ పర్యవేక్షణలో ఎస్పీ సునీల్‌ షెరాన్‌ ఆధ్వర్యంలో ఈకార్యక్రమాన్ని నిర్వహించారు. తమ మొబైల్‌ ఫోన్లు తిరిగి లభించడంతో బాధితులు జిల్లా పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్పీ సునీల్‌ షెరాన్‌ మాట్లాడుతూ ప్రస్తుతం మొబైల్‌ ఫోన్‌ ప్రతి ఒక్కరి జీవితంలో కీలకంగా మారిందన్నారు. వ్యక్తిగత సమాచారం, కుటుంబ వివరాలు, బ్యాంకింగ్‌, ఉద్యోగ, వ్యాపార సంబంధిత సమాచారం అంతా ఇందులోనే నిక్షిప్తమై ఉంటుందన్నారు. ప్రతిఒక్కరూ తమ ఫోన్లను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సుష్మిత, అదనపు ఎస్పీ ఎస్‌ ఖాదర్‌ భాషా, స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ శ్రీనివా్‌సరెడ్డి, సైబర్‌ క్రైం ఇన్‌స్పెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

వివిధ రాష్ట్రాల నుంచి..

జిల్లా సైబర్‌ బృందం ప్రత్యేకంగా పనిచేసి మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గోవా, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, తూర్పుగోదావరి, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, కడప, అనంతపురం తదితర జిల్లాల నుంచి మొత్తం 594 మొబైల్‌ ఫోన్లను గుర్తించి రికవరీ చేసింది. వాటిని నంద్యాల జిల్లా పోలీస్‌ కార్యాలయానికి తీసుకువచ్చి బాధితులకు అప్పగించారు.

Updated Date - Jul 25 , 2026 | 11:39 PM