Share News

జైలులోనే ఎమ్మెల్యే విరూపాక్షి

ABN , Publish Date - Oct 09 , 2026 | 10:59 PM

ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షికి రాష్ట్ర హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసినా కర్నూలు జిల్లా జైలు నుంచి శుక్రవారం విడుదల కాలేకపోయారు. ఆగస్టు 3వ తేదీన చిప్పగిరి పోలీస్‌ స్టేషన్‌లో ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షిపై ఒక ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది.

జైలులోనే ఎమ్మెల్యే విరూపాక్షి

బెయిల్‌ ఆర్డర్‌లో సాంకేతిక లోపాలు

కర్నూలు లీగల్‌, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షికి రాష్ట్ర హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసినా కర్నూలు జిల్లా జైలు నుంచి శుక్రవారం విడుదల కాలేకపోయారు. ఆగస్టు 3వ తేదీన చిప్పగిరి పోలీస్‌ స్టేషన్‌లో ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షిపై ఒక ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనకు కర్నూలు ఎస్సీ ఎస్టీ కోర్టు గతంలో బెయిల్‌ నిరాక రించడంతో ఆయన తరుపు న్యాయవాదులు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారిం చిన హైకోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది బెయిల్‌ ఆర్డర్‌లో సాంకేతిక లోపాలు ఉండటంతో ఆయనను విడుదల చేయడానికి అడ్డంకులు ఏర్పడ్డాయి. న్యాయవాదులు తిరిగి హైకోర్టును ఆశ్రయించి బెయిల్‌ పై విడుదల చేయించడానికి తిరిగి ప్రయత్నాలు ప్రారంభిం చారు. సాంకేతిక లోపాలు సరిదిద్దే వరకు ఆయన ఇంకా జైలులో ఉండాల్సి వచ్చింది.

Updated Date - Oct 09 , 2026 | 10:59 PM