Share News

భిన్న ఫలితాలు

ABN , Publish Date - Nov 04 , 2026 | 01:41 AM

జిల్లాలో పురుపోరులో ఓటరన్న భిన్న ఫలితాలు ఇచ్చారు. టీడీపీ, వైసీపీ మధ్య హోరా హోరీ పోరు కొనసాగింది. ఊహించని రీతిలో కౌంటింగ్‌ అర్థరాత్రి వరకు కొనసాగింది

భిన్న ఫలితాలు

పురపోరులో టీడీపీ, వైసీపీ హోరాహోరీ

నందికొట్కూరు, బేతంచెర్ల వైసీపీ కైవసం

డోన్‌లో టీడీపీ విజయం

ఆత్మకూరు, ఆళ్లగడ్డ మున్సిపాలిటీలు ఏకగ్రీవం

నంద్యాల చైర్మన్‌ పీఠంపై ఉత్కంఠ

వైసీపీ గెలిచిన రెండు వార్డుల్లో రీ కౌంటింగ్‌

అర్థరాత్రి వరకు కొనసాగిన లెక్కింపు

ఎట్టకేలకు నంద్యాలలో సైకిల్‌దే హవా

జిల్లాలో పురుపోరులో ఓటరన్న భిన్న ఫలితాలు ఇచ్చారు. టీడీపీ, వైసీపీ మధ్య హోరా హోరీ పోరు కొనసాగింది. ఊహించని రీతిలో కౌంటింగ్‌ అర్థరాత్రి వరకు కొనసాగింది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో ఆళ్లగడ్డ, ఆత్మకూరు మున్సిపాలిటీలు(ఏకగ్రీవం) టీడీపీ కైవసం చేసుకుంది. మిగిలిన నంద్యాల, డోన్‌, బేతంచెర్ల, నందికొట్కూరు, ఆత్మకూరు మున్సిపాలిటీల్లో (నాలుగు వార్డులు) పోలింగ్‌ జరిగింది. బేతంచెర్ల, నందికొట్కూరు మున్సిపాలిటీలు వైసీపీకి దక్కించుకుంది. ఒక్క డోన్‌ మున్సిపాలిటీలో టీడీపీ విజయం సాధించింది. నంద్యాల మున్సిపాలిటీ కౌంటింగ్‌ క్షణక్షణం ఉత్కంఠ భరితంగా సాగింది. ఎట్టకేలకు నంద్యాల మున్సిపల్‌ చైర్మన్‌ పీఠం కూడా టీడీపీ ఖాతాలో పడింది.

నంద్యాల, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లా వాప్తంగా కొనసాగిన పురపోరులో భిన్న ఫలితాలు వచ్చాయి. ఆత్మకూరు, ఆళ్లగడ్డ మున్సిపాలిటీలు ఏకగ్రీవమైన టీడీపీ కైవసం చేసుకుంది. మంగళవారం జరిగిన కాగా బేతంచెర్ల, నందికొట్కూరు పురపాలికలు వైసీపీ దక్కించుకున్నాయి. డోన్‌ మున్సిపాలిటీని టీడీపీ దక్కించుకుంది. నంద్యాల మున్సిపల్‌ కౌంటింగ్‌ మాత్రం ఉత్కంఠ భరితంగా సాగి చివరకు టీడీపీ ఖాతాలోకి పడింది. నంద్యాల మున్సిపాలిటీలో 52 వార్డుల పరంగా టీడీపీ-25, బీజేపీ-1, వైసీపీ-26 చొప్పున విజయం సాధించారు. నంద్యాల చైర్మన్‌ టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ బాబన్‌ పరంగా ఐదు రౌండ్లలో ఐదు రౌండ్లు పూర్తయ్యే సరికి 8405 ఓట్ల మెజార్టీ సాధించారు. ఈ లెక్కన నంద్యాల మున్సిపాలిటీ చైర్మన్‌ పీఠం కూడా టీడీపీ ఖాతాలో పడింది. ఏది ఏమైనా జిల్లాలో ఆరు మున్సిపాలిటీల్లో నాలుగు టీడీపీ, రెండు వైసీపీ చొప్పున కైవసం చేసుకుంది. నంద్యాల మున్సిపాలిటీ పరంగా వైసీపీ, టీడీపీ మద్య నువ్వా..నేనా అన్నట్లుగా వార్డుల నుంచి చైర్మన్‌ పీఠం వరకు ఓట్ల లెక్కింపు ఉత్కంఠ భరితంగా సాగింది.

మున్సిపాలిటీల వారీగా..

జిల్లాలోని నంద్యాల, బేతంచెర్ల, డోన్‌ మున్సిపాలిటీల్లో అర్థరాత్రి వరకు కౌంటింగ్‌ కొనసాగింది. టీడీపీ, వైసీపీ మధ్య నువ్వా.. నేనా అన్నట్లుగా సాగింది. వార్డుల నుంచి చైర్మన్‌ పీఠాల వరకు ఉత్కంఠగా సాగింది. నందికొట్కూరు మున్సిపాలిటీ మాత్రం మధ్యాహ్ననికే లెక్కింపు పూర్తి కావడంతో వైసీపీ విజయం సాధించి జిల్లాలో వైసీపీ బోణీ కొట్టింది. ఆత్మకూరులో నాలుగు వార్డుల లెక్కింపు కూడా ఉదయం 11గంటల లోపే వచ్చేసింది. ఇక్కడ ఓటర్లు మాత్రం ఒక్కో పార్టీకి అవకాశం కల్పించారు. నంద్యాల, బేతంచెర్ల మున్సిపాలిటీలు సైతం అర్థరాత్రి వరకు లెక్కింపు పక్రియ కొనసాగడంతో రాజకీయ పార్టీల్లో సర్వత్ర ఉత్కంఠ రేపింది.

మున్సిపాలిటీల వారీగా పరిశీలిస్తే..

బేతంచెర్ల నగరం పంచాయతీలో చైర్మన్‌ స్థానం పరంగా ఐదు రౌండ్లలో ఇప్పటికి మూడు రౌండ్లు పూర్తిగా వైసీపీ అభ్యర్థి దూదేకుల దస్తగిరి టీడీపీ అభ్యర్థి లోకేష్‌ గౌడ్‌పై 1,492 ఓట్ల మెజార్టీలో ముందంజలో ఉన్నారు. 28వార్డుల్లో టీడీపీ-10, వైసీపీ-18 చొప్పున గెలుపొందారు. ఇక్కడ వైసీపీ చైర్మన్‌ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది.

నందికొట్కూరు పురపాలికలో 36,332 ఓట్లు ఉండగా 29,220 పోలయ్యాయి. ఇక్కడ మూడు రౌండ్లలో టీడీపీ అభ్యర్థి సాబురున్నీసాపై వైసీపీ అభ్యర్థి ఫాతిమాబీ 2,620 మెజార్టీతో విజయం సాధించారు. 32 వార్డుల్లో టీడీపీ-9, వైసీపీ-23 చొప్పున గెలుపొందారు.

ఆత్మకూరు మున్సిపాలిటీలో 32 వార్డుల్లో టీడీపీ- 17, వైసీపీ-8, బీజేపీ-1, జనసేన-1 చొప్పున ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. 11, 23, 27, 29 (నాలుగు) వార్డుల్లో పోలింగ్‌ జరిగింది. టీడీపీ-1, వైసీపీ-1, స్వతంత్ర-1, సీపీఎం-1 చొప్పున విజయం సాధించారు. 20వ వార్డుకు రీషెడ్యూల్‌ ఎన్నిక త్వరలో జరగనుంది. చైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ అవుల గోవిందరాజులు ఏకగ్రీవం కావడంతో సదరు మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలో పడింది. ఈ లెక్కన వార్డుల పరంగా టీడీపీ-18, వైసీపీ-9, జనసేన-1, సీపీఎం-1, ఇండిపెండెంట్‌-1, బీజేపీ-1 చొప్పున విజయం సాధించింది. తాజాగా జరిగిన నాలుగు వార్డుల పరంగా 4370 ఓటర్లలో 3210 ఓట్లు నమోదయ్యాయి.

డోన్‌ మున్సిపాలిటీలో 52,176 ఓటర్లు ఉండగా 35,397 ఓట్లు పోలయ్యాయి. చైర్మన్‌ అభ్యర్థి పరంగా.. లెక్కించిన నాలుగు రౌండ్లలో వైసీపీ అభ్యర్థి బోయ చైతన్యపై టీడీపీ అభ్యర్థి కోట్ల సుజాతమ్మ 375ఓట్ల మెజార్టీలో విజయం సాధించారు. 36 వార్డుల్లో టీడీపీ-16, జనసేన-2, వైసీపీ-15, సీపీఐ-2, ఇండిపెండెంట్‌-1 చొప్పున గెలుపొందారు.

నంద్యాల మున్సిపాలిటీలో 1,99,238 ఓట్లు ఉండగా 1,24,501 ఓట్లు పోలయ్యాయి. మున్సిపాలిటీ చైర్మన్‌ అభ్యర్థి పరంగా ఐదు రౌండ్లు పూర్తయ్యే సరికి వైసీపీ అభ్యర్థి దాల్మిల్‌ అమీర్‌పై టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ బాబన్‌ సుమారు 8405 ఓట్ల మెజార్టీ సాధించి విజయ బావుటా ఎగరవేశారు. 52 వార్డుల్లో రెండు వార్డుల్లో రీ కౌంటింగ్‌ అనంతరం టీడీపీ-25, బీజేపీ-1, వైసీపీ-26 చొప్పున విజయం గెలుపొందారు.

ఆళ్లగడ్డ మున్సిపాలిటీ చైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి షేక్‌ అనీషాతో పాటు 32 వార్డుల్లో టీడీపీ-22, వైసీపీ-8 జనసేన-2 చొప్పున ఏకగ్రీవం కావడంతో సదరు మున్సిపాలిటీ సైతం టీడీపీ ఖాతాలో పడింది.

అధికారుల్లో.. అభ్యర్థుల్లో..

నంద్యాల మున్సిపాలిటీ చైర్మన్‌ పీఠంపై అర్థరాత్రి వరకు ఉత్కంఠగానే సాగింది. మంగళవారం ఉదయం నుంచి అర్థరాత్రేనా కౌంటింగ్‌ పూర్తి కాకపోవడంతో అటు అధికారుల్లో.. ఇటు అభ్యర్ధులు, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ పోరు సాగినట్లైంది. చైర్మన్‌ స్థానం పరంగా ఐదు రౌండ్లు పూర్తయ్యే సరికి వైసీపీ అభ్యర్థి దాల్మిల్‌ అమీర్‌పై టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ బాబన్‌ సుమారు 8407 ఓట్ల మెజార్టీ సాధించి విజయ బావుటా ఎగరవేశారు. గెలిచిన అభ్యర్థులు ఆనందోత్సవంలోను.. ఓడిన అభ్యర్థులు సైతం తీవ్ర నిరాశతో వెనుతిరిగారు. మున్సిపాలిటీల పరంగా ఓట్ల లెక్కింపు అర్థరాత్రి వరకు కొనసా గడం ఉత్కంఠ రేపింది.

ఉత్కంఠగా..

మంగళవారం జరిగిన ఆయా మున్సిపాలిటీల పోలింగ్‌ కౌంటింగ్‌ పక్రియ ఉదయం నుంచి అర్థరాత్రి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. బేతంచెర్ల, నంద్యాల, డోన్‌ మున్సిపాలిటీల్లో టీడీపీ, వైసీపీ మధ్య వాగ్వాదాలతో పాటు చిన్నపాటి ఘర్షణలకు దారీ తీసింది. పోలీసులు ఎక్కడ రంగ ప్రవేశంచేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం కౌంటింగ్‌ యథావిధిగా కొనసాగింది. నంద్యాలలో రీ కౌంటింగ్‌ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి ఎన్నికల అధికారులతో వాదనకు దిగారు. పోలీసులు సర్దిచెప్పడంతో సమస్య సద్దుమణిగింది. కౌంటింగ్‌ప్రకారం.. డోన్‌లో టీడీపీ, బేతంచెర్ల, నందికొట్కూరులో వైసీపీ పాగా వేసిం ది. నంద్యాలలో టీడీపీ వైసీపీ నువ్వానేనా అన్నట్టుగా అర్థరాత్రి వరకు పోరు నడిచింది.

పట్టుబట్టారు.. విజయం సాధించారు

నంద్యాల జిల్లా టీడీపీ పరిశీలకులు వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి, నంద్యాల నియోజకవర్గ పరిశీలకులు గడుపూటి నారాయణ స్వామి మొదట నుంచి నంద్యాల మున్సిపాలిటీపై పట్టుబడి మంత్రి ఫరూక్‌, టీడీపీ సీనియర్‌ నాయకులు ఏవీ సుబ్బారెడ్డి, ఏవీఆర్‌ ప్రసాద్‌, లాయర్‌ రామచంద్రారావు, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ హరిబాబుతో కలిసి పక్కా ప్రణాళికాబద్దంగా ముందుకు సాగారు. ప్రచారం నుంచి ఎన్నికల పోలింగ్‌ వరకు ముందుండి నడిపించారు. కూటమి పార్టీలైన బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులను సమన్వయం చేసుకొని గెలుపు సాధించారు.

జిల్లాలో పరిస్థితి ఇలా..

మున్సిపాలిటీ టీడీపీ వైసీపీ జనసేన బీజేపీ ఇతరులు

నంద్యాల 25 26 - 01 -

డోన్‌ 16 15 02 - 02

బేతంచెర్ల 10 18 - - -

నందికొట్కూరు 09 23 - - -

ఆత్మకూరు 01 01 - - 02

మొత్తం 61 83 02 01 04

ఆ రెండు మున్సిపాలిటీలు ఏకగ్రీవం

ఆళ్లగడ్డ 22 08 02 - -

ఆత్మకూరు 17 18 01 01 -

డోన్‌ - - - - 01

మొత్తం 39 26 03 01 01

Updated Date - Nov 04 , 2026 | 01:41 AM