పకడ్బందీగా మిషన్ ద్రోణాచార్య
ABN , Publish Date - May 22 , 2026 | 12:04 AM
పట్టణంలో మిషన్ ద్రోణాచార్యను పకడ్బందీగా అమలు చేయాలని.. డ్రైనేజీలపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి తెలిపారు.
డోన్ టౌన్, మే 21 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో మిషన్ ద్రోణాచార్యను పకడ్బందీగా అమలు చేయాలని.. డ్రైనేజీలపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి తెలిపారు. గురువారం 4వ వార్డులో పర్యటించి, పారిశుధ్య సమస్యలపై స్థానికులతో మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలని, సచివాలయ సిబ్బంది షాపు యజమానులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. కమిషనర్ ప్రసాద్‌గౌడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసలరామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు సలీంధ్ర శ్రీనివాసులు యాదవ్, టీఈ రాఘవేంద్రగౌడు, కోట్రికే హరికిషన్, అడ్వకేట్ కురువ లక్ష్మన్న, చనుగొండ్ల శ్రీరాములు, జిలేబీ ధను, కమిషనర్ ప్రసాద్‌గౌడు, టీడీపీ నాయకులు, అధికారులు ఉన్నారు. క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయనిధి కింద మంజూరైన రూ.10,41,634 చెక్కులను బాదిత లబ్దిదారులకు ఎమ్మెల్యే కోట్ల అందజేశారు.