‘సర్’పై అపోహలు వీడాలి
ABN , Publish Date - Jun 29 , 2026 | 12:20 AM
కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన(సర్) ప్రక్రియపై అపోహలు వీడి, సజావుగా నిర్వహించేందుకు సహకరిం చాలని ఓటర్లకు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, నగర పాలక కమిషనర్ చల్లా ఓబులేసు విజ్ఞప్తి చేశారు.
కర్నూలు ఆర్వో చల్లా ఓబులేసు
కర్నూలు న్యూసిటీ, జూన 28(ఆంధ్రజ్యోతి): కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన(సర్) ప్రక్రియపై అపోహలు వీడి, సజావుగా నిర్వహించేందుకు సహకరిం చాలని ఓటర్లకు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, నగర పాలక కమిషనర్ చల్లా ఓబులేసు విజ్ఞప్తి చేశారు. ఆయన మాట్లాడుతూ సర్ ప్రక్రియను సులభంగా వేగవంతంగా పూర్తి చేసేందుకు ఓటర్లు, రాజకీయ పార్టీల బీఎల్‌ఓలు సహకరించాలన్నా రు. రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు ఎన్నికల సంఘం నిర్దేశించిన ఏదైనా ప్రభుత్వం జారీ చేసి గుర్తింపులను అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. అదేవిధంగా 2002లో ఓటు నమోదై ఉంటే ఆ వివరాలు, లేకపోతే తల్లిదండ్రులు, అవ్వ, తాత, నాన్నమ్మ, జేజినాన్నలతో ఎవరదైనా ఓటు ఏ రాష్ట్రం, నియోజకవర్గం, పార్ట్ నంబర్, సీరియర్ నంబర్‌లో ఉందో ఆ వివరా లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. సూపర్‌వైజర్లు మంజూర్ బాషా, వాజిద్, మన్సూర్, శానిటేషన ఇనస్పెక్టర్ రాజు పాల్గొన్నారు.