మల్లన్న సేవలో మంత్రులు
ABN , Publish Date - Feb 22 , 2026 | 12:08 AM
భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను రాష్ట్ర కార్మిక, కర్మాగార శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు.
శ్రీశైలం, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను రాష్ట్ర కార్మిక, కర్మాగార శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. శనివారం తెల్లవారుజామున ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న వీరికి అర్చక వేదపండితులు తిలకధారణ చేయగా ఏఈవో వెంకటేశ్వరరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి, అ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ప్రాకార మండపంలో వేదపండితులు ఆశీర్వదించారు. తీర్థ ప్రసాదాలతోపాటు పరిమళ విభూది, శేషవస్త్రాలు, ఙ్ఞాపికతో పాటు క్షేత్ర విశేషాలను పొందుపరిచిన శ్రీశైలం కాఫీ టేబుల్ బుక్‌ను వారికి అందజేశారు.
శ్రీశైలం చేరుకున్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు గిరిజనశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి శనివారం రాత్రి శ్రీశైలం చేరుకున్నారు. ఐటీడీఏ పీవో శివప్రసాద్, తహసీల్దార్ శ్రీనివాసులు, ఆలయ పర్యవేక్షకుడు శ్రీనివాస్‌లు భ్రమరాంబ అతిథి గృహం వద్ద పుష్పగుచ్చాలు ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు. ఆదివారం స్వామి అమ్మవార్లను దర్శించుకుంటారు.