29న ఆదోనికి మంత్రి నారా లోకేశ్ రాక
ABN , Publish Date - Jul 26 , 2026 | 11:48 PM
రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈనెల 29వ తేదీన ఆదోని పట్టణానికి రానున్నారు.
ఏర్పాట్లు పరిశీలించిన టీడీపీ నాయకులు
ఆదోని, జూలై 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈనెల 29వ తేదీన ఆదోని పట్టణానికి రానున్నారు. ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు టీడీపీ నాయకులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఆదోనిలోని బైపాస్ సమీపంలో ఏర్పాటు చేయనున్న సభా ప్రాంగణాన్ని ఆదివారం జోనల్ ఇన్‌చార్జి శ్రీనివా్‌సరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, సీనియర్ నేత ఉమాపతినాయుడు, మంత్రి లోకేశ్ టీం సభ్యులు పరిశీలించారు. మీనాక్షినాయుడు మాట్లాడుతూ జూలై 29వ తేదీన సాయంత్రం 4 గంటలకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తారన్నారు. నియోజకవర్గంలోని పార్టీ ప్రజాప్రతినిధులు, క్లస్టర్, యూనిట్, బూత్ కన్వీనర్లు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు భారీసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. లోకేశ్ సమావేశానికి హాజరయ్యే వారి జాబితాను రాష్ట్ర టీడీపీ కార్యాలయం నుంచే నేరుగా ఖరారు చేసి అందజేశారని, ఇకపై స్థానికంగా ఎవరూ పేర్లను ప్రతిపాదించాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. పార్టీ శ్రేణులంతా సమన్వయంతో, పట్టుదలతో పనిచేసి ఆదోని గడ్డపై పార్టీ బలాన్ని మరోసారి ఘనంగా చాటి చెప్పాలని నాయకులు ఆకాంక్షించారు. రంగస్వామినాయుడు, రామస్వామి, టీడీపీ పట్టణాధ్యక్షుడు తిమ్మప్ప పాల్గొన్నారు.