Share News

ముఖ్య నాయకులతో మంత్రి భేటీ

ABN , Publish Date - Oct 16 , 2026 | 12:21 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు గురువారం రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ నంద్యాల నియోజకవర్గానికి చెందిన ముఖ్యనాయకులతో భేటీ అయ్యారు.

ముఖ్య నాయకులతో మంత్రి భేటీ
నాయకులతో మాట్లాడుతున్న మంత్రి

నంద్యాల రూరల్‌, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) : స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు గురువారం రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ నంద్యాల నియోజకవర్గానికి చెందిన ముఖ్యనాయకులతో భేటీ అయ్యారు. టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్‌ ఏవీ సుబ్బారెడ్డి, సీనియర్‌ నాయకుడు శివనాగిరెడ్డి, పబ్బతి వేణుగోపాల్‌లతో చర్చించారు. ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థుల గెలుపునకు సమన్వయంతో పనిచేయాలని కోరారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అభ్యర్థుల గెలుపులో ప్రతి కార్యకర్త, నాయకుడి పాత్ర కనపరచాలని పేర్కొన్నారు.

Updated Date - Oct 16 , 2026 | 12:21 AM