Share News

బనగానపల్లెలో మంత్రి పర్యటన

ABN , Publish Date - Jun 01 , 2026 | 12:04 AM

పట్టణంలోని కాలనీల్లో రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆదివారం పర్యటించారు. అభివృద్ది పనులను పరిశీలించి ప్రజల సమస్యలను, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజలను, మహిళలను తెలుసుకున్నారు.

బనగానపల్లెలో మంత్రి పర్యటన
అభివృద్ధి పనురలను పరిశీలిస్తున్న మంత్రి బీసీ

బనగానపల్లె, మే 31 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని కాలనీల్లో రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆదివారం పర్యటించారు. అభివృద్ది పనులను పరిశీలించి ప్రజల సమస్యలను, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజలను, మహిళలను తెలుసుకున్నారు. చంద్రబాబునాయుడు నగర్‌, ఈద్గానగర్‌ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. తమ ప్రాంతంలో డ్రైనేజీలో పూడిక తీయడం లేదని ఈద్గానగర్‌ వాసులు మంత్రి దృష్టికి తెచ్చారు. స్పందించిన మంత్రి వెంటనే పారిశుధ్య పనులు చేయాలని గ్రామ పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. ప్రజలకు మౌళిక సదూపాయాలు కల్పించాలని, విద్యుత్‌, రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎస్సార్బీసీ కెనాల్‌ సమీపంలో కార్పెంటర్ల కోసం స్థల పరిశీలన చేశారు. నూతన కాలనీలో ప్రజలకు అవసరమైన మౌళిక సదూపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు.

పేదలకు వరం సీఎం రిలీఫ్‌ ఫండ్‌

నిరుపేదలకు సీఎం రిలీ్‌ఫపండ్‌ వరమని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోనిక్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 28 మంది బాధితులకు రూ.14.20 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ఎన్నో ఫ్రాణాలు నిలబెట్టారన్నారు. వైద్య సేవలు, ఆరోగ్య పరిస్థితులను రోగులను అడిగి తెలుసుకున్నారు.

Updated Date - Jun 01 , 2026 | 12:04 AM