పయ్యావులతో మంత్రి బీసీ భేటీ
ABN , Publish Date - Jun 08 , 2026 | 12:02 AM
బనగానపల్లె పట్టణం లోని రోడ్లు భవనాల శాఖా మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి, నంద్యాల జిల్లా ఇన్‌చార్జి పయ్యావుల కేశవ్‌తో రోడ్లు భవనాల శాఖామంత్రి భేటీ అయ్యారు. ఆ
బనగానపల్లె, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): బనగానపల్లె పట్టణం లోని రోడ్లు భవనాల శాఖా మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి, నంద్యాల జిల్లా ఇన్‌చార్జి పయ్యావుల కేశవ్‌తో రోడ్లు భవనాల శాఖామంత్రి భేటీ అయ్యారు. ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో బనగానపల్లెకు మంత్రి పయ్యావుల కేశవ్ బనగానపల్లెలోని బీసీ జనార్దన్‌రెడ్డి ఇంటికి వచ్చారు. ఆయనకు మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆత్మీయ స్వాగతం పలికారు. శాలువాతో ఆర్థిక మంత్రిని బీసీ జనార్దన్‌రెడ్డి సత్కరించారు. అలాగే పలువురు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురు మంత్రులు ప్రస్తుత రాజకీయాలపై, త్వరలో జరిగే స్థానిక సంస్థలపై చర్చించారు. జిల్లాలోని రాజకీయ పరిస్థితులపై మాట్లాడుకున్నారు. జిల్లాలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల అమలుపై చర్చించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని నంద్యాలలో నిర్వహించే జిల్లా స్థాయి టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు మంత్రి పయ్యావుల కేశవ్ వచ్చారు. జిల్లా అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిపారు. బనగానపల్లెలోని మంత్రి బీసీ ఇంటి వద్ద రాత్రి బస చేశారు. పలువురు మంత్రి పయ్యావుల కేశవ్‌ను కలిసి అభినందనలు తెలిపారు. టీడీపీ నాయకులు దూదేకుల కార్పోరేషన్ డైరక్టర్ కాశీంబాబు, యాగంటి ఆలయ చైర్మన్ మౌళీశ్వరరెడ్డి, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు టంగుటూరు శ్రీనయ్య, అమరనాథరెడ్డి, కూరగాయల శేఖర్, సంగు శ్రీనివాసరెడ్డి, హైదర్, షేక్సావళి, ఇస్మాయిల్ ఖాన్, అల్తాప్‌హుసేన్, తదితర టీడీపీ నాయకులు మంత్రిని కలుసుకొని పుష్పగుచ్ఛాలు సమర్పించారు. మంత్రుల వెంట డోన్ డీఎస్పీ శ్రీనివాస్, బనగానపల్లె సీఐలు ప్రవీణ్‌కుమార్, మంజునాథరెడ్డి, ఎస్‌ఐ కల్పన ఉన్నారు.