Share News

కనీస వేతనాలు ఇవ్వాలి

ABN , Publish Date - Jul 10 , 2026 | 11:30 PM

రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీలకు కనీస వేతనాలు ఇచ్చి, సామాజిక భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండి. అంజి బాబు, శ్రామిక మహిళా కన్వీనర్‌ పి. నిర్మల డిమాండ్‌ చేశారు.

కనీస వేతనాలు ఇవ్వాలి
దర్నాలో మాట్లాడుతున్న సీఐటీయూ, యూనియన్‌ నాయకులు

సీఐటీయూ జిల్లా కార్యదర్శి అంజిబాబు

కలెక్టరేట్‌ ఎదుట అంగన్‌వాడీల ధర్నా

కర్నూలు న్యూసిటీ, జూలై 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీలకు కనీస వేతనాలు ఇచ్చి, సామాజిక భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండి. అంజి బాబు, శ్రామిక మహిళా కన్వీనర్‌ పి. నిర్మల డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఇచ్చిన పిలు పులో భాగంగా శుక్రవారం కలెక్టరేట్‌ ఎదుట జిల్లా అధ్యక్షు రాలు బాలదుర్గమ్మ అధ్యక్షతన ధర్నా చేశారు. జిల్లా అధికారులు ఎవరు సమాధానం చెప్పడానికి రాకపోవడంతో కార్యకర్తలు ఆగ్రహానికి గురై కలెక్టరేట్‌ గేట్‌ ఎక్కి ముట్టడించడానికి ప్రయ త్నించారు. ఈ సందర్భంగా అంజిబాబు మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకు అంగన్‌వాడీ వర్కర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క పైసా కూడ వేతనం పెంచలేదన్నారు. 1972లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అంగన్‌వాడీలకు గ్రాట్యూటీ ఇవ్వవలసి ఉందన్నారు. అంగన్‌వాడీలకు పీఎఫ్‌, ఈఎస్‌ఐ లాంటి సౌకర్యాలు కల్పించాలని, సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని అన్నారు. అనంతరం డీఆర్‌ఓ వెంకటనారా యణమ్మకు వినతి పత్రం అంద జేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్‌. రాధాక్రిష్ణ, యూనియన్‌ జిల్లా కార్యదర్శి వెంకటమ్మ, సీఐటీయూ జిల్లా కోశాధికారి ఎం.గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 10 , 2026 | 11:30 PM