కూలీల వలసబాట..
ABN , Publish Date - Feb 10 , 2026 | 12:21 AM
మండల కేంద్రం నుంచి గుంటూరు జిల్లాకు సోమవారం రాత్రి సుమారు వందమంది కూలీలు వలస వెళ్లారు. బస్సులో నంద్యాలకు చేరుకునరి అక్కడినుంచి రైలులో గుంటూరుకు వలస వెళుతున్నట్లు కూలీలు తెలిపారు.
ఇక్కడ కూలి సరిపోవడం లేదంటూ గుంటూరుకు తరలిన కూలీలు
రుద్రవరం, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రం నుంచి గుంటూరు జిల్లాకు సోమవారం రాత్రి సుమారు వందమంది కూలీలు వలస వెళ్లారు. బస్సులో నంద్యాలకు చేరుకునరి అక్కడినుంచి రైలులో గుంటూరుకు వలస వెళుతున్నట్లు కూలీలు తెలిపారు. స్థానికంగా పనిచేస్తే రోజుకు రూ.250 మాత్రమే ఇస్తున్నారని, తప్పని పరిస్థితుల్లో వెళుతున్నామని వాపోయారు. గుంటూరులో రోజుకు రూ.400 చొప్పున ఇస్తున్నారన్నారు. అధికారులు ఇక్కడే ఉపాధి పనులు కల్పించాలని కోరుతున్నారు.ఽ
కూలి సరిపోవడం లేదు..
స్థానికంగా పనులు చేస్తే కూలి ఎక్కువగా రాదు. పనిచేసుకోకుంటే పూట గడవదు. తప్పని పరిస్థితుల్లో గుంటూరు జిల్లాలో మిరప కోతలకు వెళుతున్నాం. - సుంకన్న, వలస కూలీ, రుద్రవరం
గుంటూరుకు వెళుతున్నాం
స్థానికంగా వ్యవసాయ పనులు చేస్తే రోజుకు రూ.250 మాత్రమే ఇస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో గుంటూరుకు వెళుతు న్నాం. కుంటుంబ సభ్యులమంతా అక్కడే పనిచేస్తాం. - మౌలాలి, వలస కూలీ