వైసీపీ నుంచి టీడీపీలో చేరిన పలుకూరు గ్రామస్థులు
ABN , Publish Date - Mar 22 , 2026 | 12:10 AM
మండలంలోని పలుకూర గ్రామానికి చెందిన 30 కుటుంబాలు వైసీపీని వీడి రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
బనగానపల్లె , ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): మండలంలోని పలుకూర గ్రామానికి చెందిన 30 కుటుంబాలు వైసీపీని వీడి రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. బనగానపల్లె మాజీ ఎంపీపీ అంబాల రామకృష్ణారెడ్డి, గుండం మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో శనివారం క్యాంపు కార్యాలయంలో మంత్రి కండువాలు పారీలోకి ఆహ్వానించారు. పలుకూరుకు చెందిన దూదేకుల ఇదుర్‌సాహెబ్, దస్తగిరి, భాష, హుసేని, బషీర్, ఖాదర్‌వలి, బోయపత్తికొండరాముడు, మధు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తుండటంతో పార్టీలో చేరామన్నారు. మంత్రి మాట్లాడుతూ సీఎం రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తూనే సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారన్నారు. పింఛన్ల పెంపు, తల్లికి వందనం, స్ర్తీశక్తి పథకం, అన్నదాత సుఖీభవ ఇచ్చారన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని తుంగలో తొక్కిందన్నారు. పార్టీలో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ నాయకులు గుండం మల్లిఖార్జునరెడ్డి, వల్లెపుశంకర్, ఆదవేణి రమేశ్, రామతీర్థం రామయ్య, మధు, అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ముస్లింలకు అండగా ఉంటా
ముస్లింలకు తాను ఎల్లప్పుడు అండగా ఉంటామని మంత్రి బీసీ, సతీమణి ఇందిరమ్మ అన్నారు. శనివారం పలువురు ముస్లిం సోదరులు మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కేక్ కట్ చేసి, వారికి స్వీట్లు పంపిణీ చేశారు. ముస్లింల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉందన్నారు