ప్రజల ఆరోగ్యంతో చెలగాటం
ABN , Publish Date - Feb 14 , 2026 | 11:53 PM
బోగస్ మందులతో మెడికల్ మాఫియా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కే. రామాంజనేయులు అన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రామాంజనేయులు
కలెక్టరేట్ ఎదుట ధర్నా
కర్నూలు న్యూసిటీ, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): బోగస్ మందులతో మెడికల్ మాఫియా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కే. రామాంజనేయులు అన్నారు. శనివారం ఆ పార్టీ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా కలెక్టరేట్ ఎదుట నగర కార్యదర్శి పి. రామక్రిష్ణారెడ్డి అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ మాఫియా ప్రజల జీవించే హక్కుపై పరోక్ష దాడి కొనసాగిస్తుందన్నారు. బోగస్ మందులపై యుద్ధం చేయాలని పిలు పునిచ్చారు. ప్రజ ల ఆరోగ్యాన్ని కాపాడటంలో ప్రభుత్వం విఫలమైతే, ప్రజా స్వామ్య పద్ధతుల్లో పెద్దఎత్తున ఉద్యమాల చేపడతామని హెచ్చరిం చారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య, సహాయకార్యదర్శులు ఎస్.ము న్నెప్ప, లెనిన్‌బాబు, నగర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు, మహేష్, సమా ఖ్య జిల్లా కార్యదర్శి శ్రావణిరెడ్డి, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.