క్రీడలతో మానసిక ఉల్లాసం
ABN , Publish Date - Jan 11 , 2026 | 12:00 AM
క్రీడలతో ఉద్యోగులకు ఒత్తిడి తగ్గి, మానసిక ఉల్లాసం వస్తుందని నగర పాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ అన్నారు. శనివారం ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో మున్సిపల్ ఉద్యోగుల క్రీడలను ప్రారంభించారు.
నగర పాలక సంస్థ కమిషనర్
కర్నూలు అర్బన్, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): క్రీడలతో ఉద్యోగులకు ఒత్తిడి తగ్గి, మానసిక ఉల్లాసం వస్తుందని నగర పాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ అన్నారు. శనివారం ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో మున్సిపల్ ఉద్యోగుల క్రీడలను ప్రారంభించారు. క్రీడలు ఉద్యోగుల్లో సమన్వయం, పరస్పర సహకారం, ఐక్యతను బలోపేతం చేస్తాయన్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్, కౌన్సిల్ హాలు, ఇండోర్ స్టేడియం, ఔట్‌డోర్ స్టేడియంలలో ఈ పోటీలు ఉంటాయన్నారు. క్యారమ్స్, చెస్, క్రీడలు, మహిళా ఉద్యోగుల కోసం త్రోబాల్, బ్యాడ్మింటన్ , 100 మీటర్ల రన్నింగ్ రేస్, మూజ్యకల్ చైర్స్, టగ్ ఆఫ్ వార్, రంగోలి, షటిల్ క్రిడలను ఏర్పాటు చేసిన ట్లు తెలిపారు. శని,. ఆదివారాల్లో రెండు రోజుల పాటు పోటీలు నిర్వహిస్తామ న్నారు. అలాగే సంక్రాంతి రోజు మహిళల కోసం ముగ్గుల పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విజేతలకు బహుమతులు అందజేయను న్నట్లు వెల్లడించారు. డిప్యూటీ కమిషనర్ సతీ్‌షరెడ్డి, మేనేజర్ చిన్నరాముడు, ఎస్‌ఈ రమణ మూర్తి పాల్గొన్నారు