మందులు ఫుల్... సేవలు నిల్
ABN , Publish Date - Nov 16 , 2026 | 12:04 AM
పట్టణంలోని యునాని వైద్యశాలలో మందులున్నా, వాటిని రోగులకు ఇచ్చే వైద్యుడు లేడు
యునాని ఆసుపత్రికి రెగ్యులర్ వైద్యుడు లేక రోగుల ఇబ్బందులు
బనగానపల్లె, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని యునాని వైద్యశాలలో మందులున్నా, వాటిని రోగులకు ఇచ్చే వైద్యుడు లేడు. ఇక్కడ పనిచేసిన వైద్యురాలు షబానాబేగం పదోన్నతిపై బదిలీ అయ్యారా. ఆమె స్థానంలో అధికారులు రెగ్యులర్ డాక్టర్‌ను నియమించలేదు. ఇక్కడ సిబ్బంది కూడా లేకపోవడంతో సోమవారం నుంచి గురువారం వరకు ఆసుపత్రి మూసి ఉంటుందని రోగులు వాపోతున్నారు. బేతంచెర్ల డాక్టర్ మహమ్మద్‌అధావుల్ రహిమాన్‌ను ఇన్‌చార్జిగా నియమించడంతో శుక్ర, శనివారం మాత్రమే రోగులకు అందుబాటులో ఉంటున్నారు. అలాగే దొర్నిపాడు యునాని వైద్యశాల కూడా డాక్టర్ లేక మూత పడింది. ఉన్నతాధికారులు రెగ్యులర్ వైద్యులు, సిబ్బందిని నియమించాలని రోగులు కోరుతున్నారు.