మెడికల్ మాఫియాను అరికట్టాలి
ABN , Publish Date - Feb 28 , 2026 | 11:10 PM
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మెడికల్ మాఫియాను అరికట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రామాంజనేయులు అన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రామాంజనేయులు
కర్నూలు న్యూసిటీ, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మెడికల్ మాఫియాను అరికట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రామాంజనేయులు అన్నారు. శనివారం కలెక్టరేట్ ఎదుట నగర సహాయ కార్యదర్శి సి.మహేష్ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. రామాంజనేయులు మాట్లాడుతూ మెడికల్ మాఫియా ప్రజల జీవించే హక్కుపై పరోక్ష దాడి కొనసాగిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న బోగస్ మందులపై యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు. నాణ్యతలేని, బోగస్ మందులు విచ్చలవిడిగా మార్కెట్లోకి ప్రవేశించి వేలాది మంది ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయన్నారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి పి.రామక్రిష్ణారెడ్డి, ఇన్సాఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ జాఫర్, సీనియర్ నాయకులు మనోహర్‌మాణిక్యం, ఏఐఎ్‌సఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, నగర కార్యవర్గసభ్యులు నాగరాజు, బీసన్న పాల్గొన్నారు.