మెడికల్ మాఫియాను అరికట్టాలి
ABN , Publish Date - Feb 14 , 2026 | 11:47 PM
రాష్ట్రంలో మెడికల్ మాఫియాను అరికట్టాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం నంద్యాలలోని జీజీహెచ్‌లో సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేప ట్టారు.
జీజీహెచ్‌లో సీపీఐ ఆందోళన
నంద్యాల హాస్పిటల్, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో మెడికల్ మాఫియాను అరికట్టాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం నంద్యాలలోని జీజీహెచ్‌లో సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేప ట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యతని, ప్రజలను పట్టి పీడిస్తున్న మెడికల్ మాఫియాను అరికట్టాలన్నారు. నంద్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో పీపీపీ విధానాన్ని అడ్డుకుంటామని హె చ్చరించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు, జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫకృద్దీన్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాముడు పాల్గొన్నారు.