Share News

కోసిగి 4వ వార్డులో వైద్యశిబిరం ఏర్పాటు

ABN , Publish Date - Aug 18 , 2026 | 12:14 AM

కోగిసి మేజర్‌ పంచాయతీలో డెంగీ బారిన పడి ఐదుగురు ఆస్పత్రి పాలైన ఉదంతంపై ‘ఆంధ్రజ్యోతి’లో ‘డెంగీ పంజా’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన జిల్లా మలేరియా అధికారి వెంకటేశ్వర్లు, మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఇబ్రహీం, పంచాయతీ కార్యదర్శి ఉరుకుందు, తమ సిబ్బందితో కలిసి 4వ వార్డును పరిశీలించారు

 కోసిగి 4వ వార్డులో వైద్యశిబిరం ఏర్పాటు
మాట్లాడుతున్న జిల్లా మలేరియా అధికారి వెంకటేశ్వర్లు

ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు

కదిలిన అధికార యంత్రాంగం

కోసిగి, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): కోగిసి మేజర్‌ పంచాయతీలో డెంగీ బారిన పడి ఐదుగురు ఆస్పత్రి పాలైన ఉదంతంపై ‘ఆంధ్రజ్యోతి’లో ‘డెంగీ పంజా’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన జిల్లా మలేరియా అధికారి వెంకటేశ్వర్లు, మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఇబ్రహీం, పంచాయతీ కార్యదర్శి ఉరుకుందు, తమ సిబ్బందితో కలిసి 4వ వార్డును పరిశీలించారు. సోమవారం మారెమ్మ గుడి సమీపంలో వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. కాలనీలో 26 మందికి జలుబు, తీవ్ర జ్వరం లక్షణాలు ఉండడంతో వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. సిబ్బంది ఇంటింటికి తిరుగు తూ హెల్త్‌ సర్వే చేపట్టారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉం చుకోవాలని, దోమలవ్యాప్తి చెందకుండా కాచి చల్లార్చిన నీటినే తాగాలని సూచించారు. కాలనీలోని మురుగు కాలువల పూడికతీత పనులు చేపట్టి, దోమల నివారణకు అబా ట్‌ రసాయనాన్ని పిచికారి చేయించారు. కాగా వైద్య శిబిరానికి వచ్చిన అధికారులను, పంచాయతీ సిబ్బందిని కాలనీవాసులు నిలదీశారు. రోగాలు వచ్చి ఆస్పత్రుల పాలై పత్రికల్లో వార్తలు వస్తేనే కాలనీ వైపు వస్తారా? మామూలు రోజుల్లో మా ఆవేదన పట్టదా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. వైద్య సిబ్బంది ఈశ్వరమ్మ, కోటేశ్వరమ్మ, ఉద య్‌, రాము, మల్లికార్జున, సుజాత, ఆశావర్కర్లు పాల్గొన్నారు.

Updated Date - Aug 18 , 2026 | 12:14 AM