Share News

దళారుల దందా

ABN , Publish Date - Mar 21 , 2026 | 12:54 AM

జిల్లాలో 1,55,136 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేశారు. దళారులు, వ్యాపారులు సిండికేట్‌ అయి రైతులను నట్టేట ముంచుతున్నారు. రైతు దళారుల రాజ్యంలో తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక క్వింటాకు తరుగు 3 నుంచి 4 కేజీలు తీస్తున్నారని వాపోతున్నారు. ఒక్కో ఎకరాకు 30 నుంచి 34 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది.

దళారుల దందా
హరినగరం సమీపంలో బస్తాల్లో నింపిన మొక్కజొన్నలు


తరుగుతో మాయాజాలం

క్వింటాకు 4 కేజీలు ..

మొక్కజొన్న దిగుబడి ఎకరాకు 30 క్వింటాళ్లే

ఫ జిల్లాలో 1,55,136 ఎకరాల్లో సాగు

రుద్రవరం, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 1,55,136 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేశారు. దళారులు, వ్యాపారులు సిండికేట్‌ అయి రైతులను నట్టేట ముంచుతున్నారు. రైతు దళారుల రాజ్యంలో తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక క్వింటాకు తరుగు 3 నుంచి 4 కేజీలు తీస్తున్నారని వాపోతున్నారు. ఒక్కో ఎకరాకు 30 నుంచి 34 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది.

వారు చెప్పిందే ధర..

మొక్కజొన్న కొనుగోలులో దళారుల రాజ్యం కొనసాగుతోంది. వ్యాపారులు దళారులు సిం డిికేట్‌ అయి ధరగా నిర్ణయిస్తున్నారు. చేసేదేమీ లేక వారు అడిగిన ధరకు అమ్ముకుం టున్నామని వాపోయారు. సరుకు మొక్కజొన్నలు మేచరు (తేమశాతం) చూసి వారు పెట్టిందే రేటు అడిగిందే ధరగా కొనసాగుతుంది. రైతులు నోరు మెదిపితే ఆ సరుకు కొనుగోలు చేయకుండా చేస్తున్నారు.

వంద కేజీల మొక్కజొన్నలు..

వంద కేజీల మొక్కజొన్నలు కొనుగోలు చేసి అందులో 4కేజీలు తరుగు చొప్పున వ్యా పారులు, దళారులు దోపిడీ చేస్తున్నారు. 2 గోనె సంచులకు కిలో తూకం వెళ్లినా రెండు కేజీలు అదనంగా తరుగు తీస్తున్నారని రైతులు లబోదిబోమంటున్నారు.

క్వింటా ధర రూ.1600కు తగ్గిన వైనం

గత ఏడాది రూ.2300 ఉండేది. మార్చి మాసంలో మొక్కజొన్న ధర క్వింటా రూ.1600కు పడిపోయింది. ఒక క్వింటాపై రూ.700 రైతులు నష్టపోతున్నాడు. వ్యాపారులు దళారులు సిండికేట్‌గా మారి ధర తగ్గిస్తున్నారని రైతులు ఆవేదన. అధికారులు జోక్యం చేసుకుని మార్కెట్‌ రేటుకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.

మద్దతు ధర ఇవ్వండి

మొక్కజొన్నకు మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకోవాలి. కొనుగోలు కేంద్రాలు లేక మొక్కజొన్న విక్రయంలో తీవ్రంగా నష్టపోతున్నాం. - పత్తి బ్రహ్మయ్య, రైతు, ఆలమూరు

ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

మొక్కజొన్న కేంద్రాలు ఏర్పాటుచేసి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. తరుగు క్వింటాకు 4కేజీలు దళారులు మింగేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయాలి. - భాస్కర్‌, సీీపీఐ జిల్లా కార్యవర్గసభ్యుడు, నంద్యాల

ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందలేదు

ప్రభుత్వం, ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందలేదు. ప్రస్తుతం పప్పుశనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతులు రైతు సేవాకేంద్రాలను సందర్శించి పప్పుశనగ విక్రయించుకునేందుకు పేర్లను నమోదు చేసుకోవాలి. - సుమతి, ఏవో, రుద్రవరం

Updated Date - Mar 21 , 2026 | 12:54 AM