తాగునీటి సమస్య రాకుండా చర్యలు
ABN , Publish Date - Apr 17 , 2026 | 11:16 PM
పశ్చిమ ప్రాంతంలో వేసవిలో తాగునీటి సమస్య రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ మనోహర్ అన్నారు.
ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ మనోహర్
గోనెగండ్ల, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): పశ్చిమ ప్రాంతంలో వేసవిలో తాగునీటి సమస్య రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ మనోహర్ అన్నారు. శుక్రవారం ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో డీఈ విద్యాసాగర్‌తో కలిసి ఆయన పర్యటించారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో గోనెగండ్ల, అలువాల, గుడిక ల్లు, చిన్నకొత్తిలి, హలహర్తి, నాగలదిన్నె గ్రామాల్లో, మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగి, పెద్దకడుబూరు, రాంపురం, సూగురు ఎస్‌ఎస్ ట్యాంక్‌లను పరిశీలించారు. మనోహర్ మాట్లాడుతూ తుంగభద్ర దిగువ కాలువ నీరు ఈ నెలాఖరి వరకు విడుదల కావచ్చని, ఆయా గ్రామాల్లోని పంచాయతీ సిబ్బంది, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ఎస్‌ఎస్ ట్యాంక్‌లను ఎల్‌ఎల్‌సీ నీటితో నింపాలని కోరారు. గోనెగండ్లలోని ఎస్‌ఎస్ ట్యాంక్ దగ్గర ఏర్పాటుచేస్తున్న మైక్రోఫిల్టర్ పనులను సైతం పరిశీలించారు. ఏఈ శ్రీనివాసరెడ్డి, కాంట్రాక్టర్ అడ్వకేట్ చంద్రశేఖర్, టీడీపీ నాయకులు బేతాల బడేసా, వేణు, సిబ్బంది పాల్గొన్నారు.