పారిశుధ్య మెరుగునకు చర్యలు: కమిషనర్
ABN , Publish Date - May 02 , 2026 | 12:24 AM
నగరంలో పారిశుధ్య మెరుగునకు చర్యలు తీసుకుంటున్నట్లు నగర పాలక సంస్థ కమిష నర్ చల్లా ఓబులేసు అన్నారు.
కర్నూలు న్యూసిటీ, మే 1(ఆంధ్రజ్యోతి): నగరంలో పారిశుధ్య మెరుగునకు చర్యలు తీసుకుంటున్నట్లు నగర పాలక సంస్థ కమిష నర్ చల్లా ఓబులేసు అన్నారు. శుక్రవారం ఆయన 10వ శానిటేషన డివిజనలో మస్టర్ తనిఖీ నిర్వహించారు. బంగారుపేట, రివర్‌వ్యూ కాలనీ, కొండారెడ్డి బురుజు, పూలబజార్ తదితర ప్రాంతాల్లో పారి శుధ్య పనులను పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ త్వరలో 4 వేల డస్ట్‌బి నలు కొనుగోలు చేస్తామన్నారు. ప్రజారోగ్య అధికారి డా.ఎం.రఘు, ఎస్‌ఈ రమణమూర్తి, డీసీపీ వెంకటరమణ, ఎంఈలు మనోహర్‌రెడ్డి, గిరిరాజ్, డీఈఈలు క్రిష్ణలత, శ్రీనివాసన, ఏఈ జనార్ధన, శానిటేషన ఇన్సపెక్టర్లు పాల్గొన్నారు.