Share News

రైతులకు పరిహారం అందేలా చర్యలు

ABN , Publish Date - Nov 18 , 2026 | 12:12 AM

ప్రకృతి వైపరీత్యాలతో రైతుల పంట నష్టానికి గురైతే పరిహారాన్ని బీమా కంపెనీల ద్వారా అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఏ.సిరి అధికారులను ఆదేశించారు.

రైతులకు పరిహారం అందేలా చర్యలు
పంటల బీమా పథకం పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న్ల కలెక్టర్‌

కలెక్టర్‌ ఏ.సిరి

కర్నూలు అగ్రికల్చర్‌, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): ప్రకృతి వైపరీత్యాలతో రైతుల పంట నష్టానికి గురైతే పరిహారాన్ని బీమా కంపెనీల ద్వారా అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ప్రధానమంత్రి ఫసల్‌ బీమా పోస్టర్‌ను కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ ప్రస్తుత రబీ సీజనకు సంబంధించి జిల్లాలో ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన రైతులు తమ పంటలకు సంబంధించిన నిర్ణీత బీమా ప్రీమియాన్ని డిసెంబరు 15వ తేదీలోగా చెల్లించి పంటల బీమా రక్షణ పొందాలన్నారు. జిల్లాలోని రైతులంతా బీమా పథకంలో చేరేందుకు వ్యవసాయ అనుబంధ విభాగాల అధికారులు క్షేత్ర స్థాయిలోకి వెళ్లి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కార్య క్రమంలో వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మి, డ్వామా పీడీ నరసింహారెడ్డి, పశుసంవర్దక శాఖ జేడీ రాజశేఖర్‌, డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్‌రావు, టాటా ఏఐజీ బీమా కంపెనీ కోఆర్డినేటర్‌ కళ్యాణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 18 , 2026 | 12:13 AM