Share News

మాదక ద్రవ్యాల నియంత్రణకు చర్యలు: కలెక్టర్‌

ABN , Publish Date - Feb 27 , 2026 | 11:08 PM

జిల్లాలో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు సమగ్ర చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాజకుమారి ఆదేశించారు.

మాదక ద్రవ్యాల నియంత్రణకు చర్యలు: కలెక్టర్‌
మాట్లాడుతున్న కలెక్టర్‌, ఎస్పీ

నంద్యాల క్రైం/నూనెపల్లి, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు సమగ్ర చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో శుక్రవారం నిర్వహించిన ఎన్‌కోర్డ్‌ జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఎస్పీ సునీల్‌ షెరాన్‌తో పాటు ఏఎస్పీ యుగంధర్‌బాబు, ఎక్సైజ్‌, పోలీసు, వైద్య ఆరోగ్యశాఖ, డీఈవో, ఐసీడీఎస్‌, బీసీ, ఎస్సీ వెల్ఫేర్‌ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలల్లో మత్తు పదార్థాల వినియోగంపై ఏమైనా ఫిర్యాదులు వచ్చాయా అన్న విషయాన్ని పరిశీలించాలన్నారు. మాదక ద్రవ్యాలకు విద్యార్థులు బానిస కాకుండా ముందస్తు చర్యలు చేపట ్టడంతోపాటు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. యువతను రక్షించేందుకు తల్లిదండ్రులు, విద్యాసంస్థల యాజమాన్య కమిటీలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి అవుతున్న గంజాయి, గుట్కా, ఇత రత్రా మత్తు పదార్థాలను అరికట్టేందుకు పోలీసు శాఖ ప్రత్యేక డ్రైవ్‌లు చేపడుతుందన్నారు.

Updated Date - Feb 27 , 2026 | 11:08 PM