Share News

రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు: కలెక్టర్‌

ABN , Publish Date - Jun 23 , 2026 | 11:46 PM

చెరువు ఆయకట్టు రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాజకుమారి ఇరిగేషన్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు: కలెక్టర్‌
తంగడంచ చెరువును పరిశీలిస్తున్న కలెక్టర్‌ రాజకుమారి

జూపాడుబంగ్లా, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): చెరువు ఆయకట్టు రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాజకుమారి ఇరిగేషన్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం కలెక్టర్‌ రాజకుమారి గురుకుల పాఠశాల, కస్తూర్బా బాలికల పాఠశాలలను తనిఖీ చేశారు. గురుకులంలో అపరిశుభ్రతపై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల ఆవరణలో పచ్చదనాన్ని పెంచేలా ఆలా్ట్రహైడెన్సిటీ ప్లాంటేషన్‌ చేపట్టాలని, పర్యావరణ పరిరక్షణతోపాటు విద్యార్థుల్లో ప్రకృతిపట్ల అవగాహన పెంచాలని ఆదేశించారు. ప్రతి విద్యార్థి ఒక మొక్కను దత్తత తీసుకుని పెంచేలా చూడాలని సూచించారు. గురుకులంలో తాగునీటి ఇబ్బంది లేకుండా చూడాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. అనంతరం జలధార -జలహారతి కింద నిర్మించే తంగడంచ చెరువు పనులను పరిశీలించారు. చెరువుకు అనుసంధానం ఉన్న పగిడిచర్ల వాగును పరిశీలించారు. వాగును చూసేందుకు కలెక్టర్‌ ఆటోలో రెండు కిలోమీటర్లమేర వెళ్లి చూసి ఇంకా వాగును వెడల్పు చేయాలని అధికారులను ఆదేశించారు. అక్కడే ఉన్న రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ చంద్రశేఖర్‌నాయక్‌, ఎంపీడీవో గోపికృష్ణ, సొసైటీ చైర్మన్‌ శ్రీనివాసులు, ఇరిగేషన్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 23 , 2026 | 11:46 PM