సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Nov 17 , 2026 | 12:16 AM
నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కార్పొరేషన కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు.
కార్పొరేషన కమిషనర్ చల్లా ఓబులేసు
కర్నూలు న్యూసిటీ, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కార్పొరేషన కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు. స్థానిక ఎస్‌బీఐ కాలనీలోని నగర పాలక సమావేశ భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పర్య టించి సమస్య ప్రాంతాన్ని సందర్శించినప్పుడు సమస్యను పూర్తిగా గ్రహించి, పరిష్కారం కనుగొనడం సులభమవుతుందన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఈ జే.రమణమూర్తి, డీసీపీ షబ్నమ్ శాసి్త్ర, కార్యదర్శి నాగరాజు, ఆర్‌ఓలు, వాజిద్, క్రిస్టోఫర్, టిడ్కో అధికారి పెంచలయ్య, మెప్మా సీఎంఎం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.