Share News

ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Sep 21 , 2026 | 12:23 AM

ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అధికారులను ఆదేశించారు.

ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి
ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌

మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌

కూలిన బ్రిడ్జి సైడ్‌వాల్‌ను పరిశీలించిన ఫరూక్‌

నంద్యాల కల్చరల్‌, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అధికారులను ఆదేశించారు. ప్రథమ నందీశఽ్వరాలయం రహదారి వంతెన సైడ్‌వాల్‌ ఆదివారం ఉదయం వర్షాలకు కుంగిపోయింది. ప్రథమ నందికి వెళ్లేబ్రిడ్జిని ఆనుకుని ఉన్న రోడ్డు ఒక వైపు కోతకు గురై కూలిపోయింది. ఆలయ చైర్మన్‌ చలంబాబు మంత్రి, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ స్పందించి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దెబ్బతిన్న రోడ్డు భాగాన్ని పరిశీలించి, అధికారులతో మాట్లాడారు. వాహనదారులకు, ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా ముందస్తుగా హెచ్చరిక బోర్డులు, బారికేడ్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం పటిష్టమైన శాశ్వత రక్షణగోడ నిర్మాణానికి అవ సరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2026 | 12:23 AM