Share News

ఉద్యాన రంగ అభివృద్ధికి చర్యలు

ABN , Publish Date - Oct 13 , 2026 | 11:53 PM

జిల్లాలో ఉద్యానరంగ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్‌ రాజకుమారి అన్నారు.

ఉద్యాన రంగ అభివృద్ధికి చర్యలు
మాట్లాడుతున్నకలెక్టర్‌ రాజకుమారి, మున్సిపల్‌ కమిషనర్‌

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లి, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉద్యానరంగ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్‌ రాజకుమారి అన్నారు. మంగళ వారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో సుమారు 45వేల హెక్టార్లలో విస్తరించిన ఉద్యాన తోటల సాగు, మార్కెటింగ్‌, ఎగుమతుల వరకు అవసరమైన సాంకేతిక మౌలిక సదుపాయాలు కల్పించేందుకు 15 క్లస్లర్లను ఏర్పాటు చేశామన్నారు. అక్టోబరు 12 నుంచి 17వరకు రాయలసీమ హార్టికల్చర్‌ హబ్‌ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఉద్యాన రంగంలో ఆసక్తికల్గిన వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విజయవాడ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్‌ అడ్మినిస్టేషన్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీలు స్థానిక ఎన్నికల నిర్వహణ అంశంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈసమీక్షకు నంద్యాల కలెక ్టరేట్‌ నుంచి కలెక్టర్‌ రాజకుమారి, మున్సిపల్‌ కమిషనర్‌ బండి శేషన్న పాల్గొన్నారు.

Updated Date - Oct 13 , 2026 | 11:53 PM