భోజన పథకాన్ని స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వరాదు
ABN , Publish Date - Apr 24 , 2026 | 11:38 PM
మధ్యాహ్న భోజన పథకాన్ని స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వరాదని ఏపీ మధ్యాహ్న భోజన పథక కార్మిక సంఘం డిమాండ్ చేసింది.
కర్నూలు ఎడ్యుకేషన/ న్యూసిటీ, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): మధ్యాహ్న భోజన పథకాన్ని స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వరాదని ఏపీ మధ్యాహ్న భోజన పథక కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఈ పథకాన్ని స్వచ్చంద సంస్థలకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ కార్యక్రమానికి మధ్యాహ్న భోజన కార్మిక సంఘం నగర అధ్యక్షురాలు లలితమ్మ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.గోపాల్, సీఐటీయూ నగర కార్య దర్శి ఆర్.నరసింహులు, ఓల్డ్ సిటీ నగర అధ్యక్షుడు డి.అబ్దుల్ దేశాయ్, సీఐటీయూ నగర ఉపాధ్యక్షుడు కే.సుధాకరప్ప హాజరై మా ట్లాడారు. గత ఇరవై ఏళ్ల నుంచి ఎలాంటి అమరికలు లేకుండ విద్యార్థులకు నాణ్యమైన, వేడి భోజనాన్ని వడ్డిస్తున్నార న్నారు. ప్రస్తుతం ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పేరు తీసుకుని వచ్చి ఆమె పేరును చెడగొట్టడానికి కంకణం కట్టుకుందన్నారు స్మార్ట్ కిచెర్ల పేరుతో ఎప్పుడో తెల్లవారుజామున 3 గంటలకు వండిన భోజనాన్ని మధ్యాహ్నం 12 గంటలకు స్కూల్ దగ్గరికి తెచ్చి వడ్డిస్తే అది వాసన వస్తుం దన్నారు. అనం తరం ఇనచార్జి డీఆర్‌వో చిరంజీవికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కార్యక్రమంలో భోజన కార్మికులు భారతి, ఎస్తేరమ్మ, శ్రీరాములు, ప్రభు దాసు, రజియాబీ, అక్తరున్నిసా, సునంద పద్మ, లీలావతమ్మ, పద్మావ తమ్మ, హీరాబాయి, నాగరాజు, పద్మావతి, లక్ష్మీదేవమ్మ, జయలక్ష్మి, పార్వతమ్మ, లలితమ్మ పాల్గొన్నారు.