Share News

కొత్త సంవత్సరం శుభాలను తీసుకురావాలి

ABN , Publish Date - Mar 19 , 2026 | 11:47 PM

శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రజలకు శుభాలను తీసుకురావాలని పరిశ్ర మల శాఖ మంత్రి టీజీ భరత్‌ ఆకాంక్షించారు.

కొత్త సంవత్సరం శుభాలను తీసుకురావాలి

పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌

కర్నూలు అర్బన్‌, మార్చి 19(ఆంధ్రజ్యోతి): శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రజలకు శుభాలను తీసుకురావాలని పరిశ్ర మల శాఖ మంత్రి టీజీ భరత్‌ ఆకాంక్షించారు. గురు వారం కలె క్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో పరాభవనామ సంవత్సర ఉగాది ఉత్సవాల సందర్భంగా కలెక్టర్‌ డా. ఏ సిరి, జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌తో కలిసి పంచాంగ శ్రవణ కార్యక్ర మంలో పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ గతేడాది ఎటువంటి ఇబ్బందులు లేకుండా గడిచిందన్నారు. ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు నాయ కత్వంలో ప్రభుత్వం అద్భుతంగా పని చేసిందన్నారు. కలెక్టర్‌ డా.ఏ.సిరి మాట్లాడుతూ ఎన్నో ఆశలు.. ఆశయాలు, దృఢసంకల్పంతో ఈ కొత్త సంవత్సరాన్ని ప్రారం భించుకుం టామని తెలిపారు. జీవితంలో సుఖం, కష్టం రెండూ వస్తాయి వాటన్నింటిని మనం సమానంగా ఎదుర్కోవాలన్నారు. జేసీ నూరుల్‌ ఖమర్‌ సంప్రదాయ పంచ కట్టుతో కార్యక్ర మానికి హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన మాట్లాడుతూ తాను బిహార్‌ నుంచి వచ్చానని అన్నారు. బిహార్‌లో దీపావళి, దసరా ముఖ్యమని, ఇక్కడ ఉగాది, సంక్రాంతి పండుగలను చాలా గొప్పగా జరుపుకుంటారని కొనియాడారు. వేదపండితులు, అర్చకులను సన్మానించారు. కవి సమ్మేళనంలో డా.దండెబోయిన పార్వతిదేవి, కేవీ సుబ్బలక్ష్మమ్మ, డా.కర్నాటి చంద్రమౌళిని, కండే సునీత, డా.సరూప్‌, బీవీ స్వరూప్‌, అరెపల్లి వరలక్షమ్మ, సుధాకర్‌ శర్మలను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. డీఆర్వో వెంకట నారాయణమ్మ, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ పార్వతి, సెట్కూర్‌ సీఈవో వేణుగోపాల్‌, హౌసింగ్‌ పీడీ చిరంజీవి, దేవదాయ శాఖ ఏసీ సుధాకర్‌రెడ్డి, గిరిజన శాఖ అధికారి సురేష్‌, తహసీల్దార్‌ రమేష్‌, మెప్మా పీడీ శ్రీనివాసులు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు చైర్మన్లు పాల్గొన్నారు.

Updated Date - Mar 19 , 2026 | 11:47 PM