మాతా శిశు మరణాలను నివారించాలి
ABN , Publish Date - Apr 24 , 2026 | 11:07 PM
మతా శిశు మరణాలు జరగకుండా క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు సేవలు అందించాలని డీఎంహెచ్‌వో డా. వెంకటరమణ తెలిపారు.
డీఎంహెచ్‌వో డాక్టర్ వెంక టరమణ
నంద్యాల టౌన్, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): మతా శిశు మరణాలు జరగకుండా క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు సేవలు అందించాలని డీఎంహెచ్‌వో డా. వెంకటరమణ తెలిపారు. శుక్రవారం ఆసుపత్రిలోని సమావేశ భవనంలో మతా శిశు మరణాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇటీవల బేతంచెర్ల, ఉప్పలపాడులో జరిగిన శిశుమరణాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. గర్భిణిలకు అవసరమైన పరీక్షలను చేయించి మతాశిశు మరణాలను ఆరికట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆడిషనల్ డీఎంహెచ్ వో శారదాబాయి, వైద్యాధికారులు డా. సుదర్శన్‌బాబు, ప్రసన్నలక్ష్మి, డా. లక్ష్మినారాయణమ్మ, సుధారాణి, డీసీహెచ్‌ఎస్ డా.ఒ లలితా, డా. రవీంధ్రనాథ్‌రెడ్డి డా. శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.