టీడీపీలోకి భారీగా చేరికలు
ABN , Publish Date - Oct 23 , 2026 | 12:13 AM
పాణ్యం నియోజక వర్గంలో వైసీపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు టీడీపీలోకి భారీగా చేరుతున్నారు.
వైసీపీని వీడిన పాణ్యం మాజీ ఉప సర్పంచు
కల్లూరు, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): పాణ్యం నియోజక వర్గంలో వైసీపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు టీడీపీలోకి భారీగా చేరుతున్నారు. నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, నందికొట్కూరు టీడీపీ ఇనచార్జి గౌరు వెంకటరెడ్డి సమక్షంలో గురువారం పాణ్యం మండల కేంద్రానికి చెందిన వైసీపీ మాజీ ఉప సర్పంచు పాలం చంద్రశేఖర్‌రెడ్డితో పాటు రామేశ్వరరెడ్డి, బాల రాజు, గడ్డం బాషా అలాగే సుగాలిమెట్ట వైసీపీ నాయకుడు వెంకట్‌నాయక్ వైసీపీని వీడి టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన వారికి గౌరు దంపతులు కండువాలు కప్పి సాదరం గా ఆహ్వానం పలికారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రంగ రమేష్, మండల నాయకులు గోపాల్, వెంకటేశం, ఖాదర్, కమ్మ శ్రీనివాసరెడ్డి, తిరుపాల్ నాయక్, హనుమనాయక్ పాల్గొన్నారు.
టీడీపీలో చేరిన బ్రాహ్మణపల్లె వైసీపీ నాయకులు: ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లెకు చెందిన వైసీపీ నాయకులు రాజగోపా ల్‌రెడ్డి, దేవరాజు, కురువ వెంకటేశ్వర్లు, రవి, చందు భూషన్న, అవుకు సుబ్బరాయుడడు, రవీంద్ర టీడీపీలో చేరారు. గురువారం మాధవీనగర్ క్యాంపు కార్యాలయంలో గౌరు దంపతుల సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, రాజశేఖర్ చౌదరి, రామ పుల్లారెడ్డి, గ్రామ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.