టీడీపీలోకి భారీ చేరికలు
ABN , Publish Date - Jul 20 , 2026 | 12:15 AM
కర్నూలు మండలం ఉల్చాల గ్రామం నుంచి భారీ సంఖ్యలో స్థానికులు టీడీపీలోకి చేరారు.
కర్నూలు రూరల్, జూలై 19(ఆంధ్రజ్యోతి): కర్నూలు మండలం ఉల్చాల గ్రామం నుంచి భారీ సంఖ్యలో స్థానికులు టీడీపీలోకి చేరారు. ఆదివారం కేడీసీసీ బ్యాంకు చైర్మన డి. విష్ణువర్ధనరెడ్డి సమక్షంలో ఆయన స్వగృహం వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఉల్చాల గ్రామానికి చెందిన బాబు రెడ్డి, ఎద్దుల మాల కృష్ణారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, రాజారెడ్డి, రవిరెడ్డి, సోమేశ్వర రెడ్డి, రమేష్ రెడ్డి, ఆనంద్‌రెడ్డి తదితర 200 కుటుంబాల వారు డిసి్ట్రక్ విజిలెన్స మానిటరింగ్ మెండర్ మద్దిలేటి, వెంకటేశ, కొంతలపాడు బీసన్న, హనుమంతు, ఈశ్వర్ ఆధ్వర్యంలో, డి. విష్ణువర్థనరెడ్డి సమక్షంలో తెలుగు దేశం పార్టీలో చేరారు. వారు మాట్లాడుతూ కోడుమూరు నియోజిక వర్గంలో కేడీసీసీబీ చైర్మన డి. విష్ణువర్ధనరెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరిల ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి చూసి తాము టీడీపీలో చేరామన్నారు.