Share News

ఉపాధిలో భారీ అవకతవకలు

ABN , Publish Date - Feb 05 , 2026 | 11:25 PM

మండలంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో జరిగిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో భారీ అవకతవకలు జరిగినట్లు సామాజిక తనిఖీ బృందం వెల్లడించింది.

ఉపాధిలో భారీ అవకతవకలు
ఉపాధి పనులపై సామాజిక తనిఖీ చేస్తున్న అధికారులు

నామమాత్రంగా సామాజిక తనిఖీ

కొత్తపలి, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): మండలంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో జరిగిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో భారీ అవకతవకలు జరిగినట్లు సామాజిక తనిఖీ బృందం వెల్లడించింది. గురువారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో ఎంపీడీవో మేరీ ఆధ్వర్యంలో డ్వామా పీడీ సూర్యనారాయణ, ఏపీడీ వెంకట్రామిరెడ్డి, ఏవీవో పరమేశ్వరుడు, ఎస్‌ఆర్‌పీ చంద్రమోహన్‌ పర్యవేక్షణలో 18వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక ద్వారా ఆయా గ్రామాల్లో 1-4-2024 నుంచి 31-3-2025 వరకు జరిగిన ఉపాధి పనులపై చర్చ కొనసాగించారు. గత ఏడాది డిసెంబరు 16 నుంచి ప్రస్తుతం ఫిబ్రవరి 2వ తేదీ వరకు 12 గ్రామ పంచాయతీల్లో ముగ్గురు డీఆర్‌పీల ఆధ్వర్యంలో ఒక ఎస్‌ఆర్‌పీ పర్యవేక్షణలో ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స ద్వారా చేపట్టిన పనులను పరిశీలించారు. మండలంలో ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స ద్వారా గత ఏడాది కాలంలో ఆయాశాఖల ద్వారా 961పనులు గుర్తించి రూ.9.90 కోట్లు నిధులు ఖర్చు చేసినట్లు పీడీ వెల్లడించారు. ఉపాధి శ్రామికుల వేతనాల కింద రూ.6.99 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించగా.. వివిధ పనులకు సంబంధించిన మెటీరియల్స్‌కు రూ.2.91 కోట్ల ఖర్చు చేసినట్లు చెప్పారు. చేపట్టిన పనులకు, ఖర్చు చేసిన నిధులకు పొంతన లేకపోవడంతో సామాజిక తనిఖీలో అక్రమాలు వెలుగులోకి వచ్చినప్పటికీ సంబంధిత సిబ్బందిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఏదీ ఏమైనా సోషల్‌ ఆడిట్‌లో రూ.1.79కోట్లు అక్రమాలు జరిగినట్లు చెప్పి తనిఖీ బృందం మమ అనిపించేసి వెళ్లిపోయారు. అధికారులు, సిబ్బంది ద్వారా ప్రజాధనం ఏవిధంగా రికవరీ చేస్తారో వేచి చూడాల్సిందే. పీఆర్‌ ఏఈ మద్దిలేటి, ఏపీవోలు విమలమ్మ, రేష్మా, సీసీ శ్రీనివాసులు, ఐటీడీఏ ఏపీవో రాజు నాయక్‌, సీఆర్‌పీలు రమేష్‌, సురే్‌షబాబు, పెద్దయ్య, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, టీఏలు పాల్గొన్నారు.

Updated Date - Feb 05 , 2026 | 11:25 PM