Share News

టీడీపీలోకి భారీగా చేరికలు

ABN , Publish Date - Oct 29 , 2026 | 12:05 AM

పాణ్యం నియోజకవర్గం లో వైసీపీ నుంచి టీడీపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు.

టీడీపీలోకి భారీగా చేరికలు
ఎమ్మెల్యే గౌరు చరిత సమక్షంలో టీడీపీలో చేరిన ఓర్వకల్లు వైసీపీ మాజీ సర్పంచు సుబ్బమ్మ తదితరులు

వైసీపీని వీడిన ఓర్వకల్లు మాజీ సర్పంచు

కల్లూరు, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): పాణ్యం నియోజకవర్గం లో వైసీపీ నుంచి టీడీపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఓర్వక ల్లుకు చెందిన మాజీ సర్పంచు సుబ్బమ్మతోపాటు 20 కుటుంబాలు నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వా నించారు. ఈసందర్భంగా గౌరు చరిత మాట్లాడుతూ పాణ్యం నియోజ కవర్గ అభివృద్ధిలో భాగస్వామం అ య్యేందుకు అనేకమంది టీడీపీలో చేరేందుకు ఉత్సాహంగా ముందు కు వస్తున్నారన్నారు. టీడీపీలో చేరిన వారిలో హనుమన్న, వెంకటేశ్వ ర్లు, సంజీవ, నజీర్‌, అహ్మద్‌, షాలీబాషా, ఆటో బాషా, సంజమ్మ ఉ న్నారు. మండల నాయకులు గోవిందరెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, రాంభూ పాల్‌రెడ్డి, యోసోబు, అయూబ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 29 , 2026 | 12:05 AM