నేడు సామూహిక వరలక్ష్మీ వ్రతం
ABN , Publish Date - Aug 20 , 2026 | 11:34 PM
భక్తుల్లో సనాతన ధర్మంపై అవగాహన కల్పిస్తూ శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు, ఛైర్మన్ పోతు గుంట రమేశ్ నాయుడు తెలిపారు.
శ్రీశైలం, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి) : భక్తుల్లో సనాతన ధర్మంపై అవగాహన కల్పిస్తూ శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు, ఛైర్మన్ పోతు గుంట రమేశ్ నాయుడు తెలిపారు. శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తారన్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం చంద్రావతి కల్యాణ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 1500 కలశాలను నెలకొల్పి మహిళలు ఉచితంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు పూజద్రవ్యాలతో పాటు అమ్మవారి శేష వస్ర్తాలు, చీర, రవిక, పూలు గాజులు, లడ్డు ప్రసాదం, శ్రీశైలం ప్రభ పుస్తకం, తులసి, ఉసిరి మొక్కలను అందిస్తున్నట్లు తెలిపారు.