పంట ఉత్పత్తులతో మార్కెట్ కళకళ
ABN , Publish Date - Mar 16 , 2026 | 12:27 AM
ఎమ్మిగనూరు వ్యవ సాయ మార్కెట్‌కు పంట ఉత్ప త్తులు భారీగా అమ్మకానికి వచ్చాయి.
స్వల్పంగా పెరిగిన వేరుశనగ ధర
ఎమ్మిగనూరు, మార్చి 15(ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు వ్యవ సాయ మార్కెట్‌కు పంట ఉత్ప త్తులు భారీగా అమ్మకానికి వచ్చాయి. వేరుశనగతో పాటు ఆముదాలు, కందులు, మొక్కజొన్న, శనగతో కలిపి మొత్తం 12151 (3,693క్వింటాళ్లు) బస్తాలు రైతులు అమ్మకానికి తరలించారు. మార్కెట్ పంట ఉత్పత్తులతో కళకళలాడింది. వేరుశనగ ధర గత వారంతో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. గత శుక్రవారం వేరుశనగ గరిష్ఠ ధర రూ.8,700లు పలుకగా ఆదివారం రూ. 9,290 పలికింది. మార్కెట్‌కు వేరుశనగ 11,914బస్తాలు(3574క్వింటాళ్లు)రాగా కనిష్ఠం రూ. 3461, మధ్యస్థం రూ.7120, గరిష్ఠం రూ.9,290 పలికాయి. ఆముదాలు 176 బస్తాలు (88క్వింటాళ్లు) రాగా కనిష్ఠ ధర రూ.2520, గరిష్ఠం రూ.5904లు, కందులు 11బస్తాలు (6క్వింటాళ్లు)రాగా కనిష్ఠ ధర రూ.6520లు, గరిష్ఠం రూ. 7029లు, మొక్కజోన్న 27 బస్తాలు(14క్విటాళ్లు) కనిష్ఠ ధర రూ.1050, గరిష్ఠం ధర రూ. 1050లు పలికాయి.